స్కిల్ స్కామ్ అంటూ హడావుడి చేస్తున్న వైసీపీ.. సీఎం జగన్ చివరికి అసెంబ్లీలోకూడా దీని గురించి ప్రకటన చేశారు. కానీ అసలు స్కామేంటో చెప్పలేకపోయారు. కానీ జగన్ స్పీచ్ మొత్తం విన్న వారికి అందులో స్కామ్ ఎక్కడ ఉందో అర్థం చేసుకోలేరు. ఎందుకంటే ఆయన ఫలానా అంశం స్కాం అనిచెప్పలేకపోయారు. మాట కంటే ముందు చంద్రబాబుకు డబ్బులు చేరాయనడం తప్ప ఎలా చేరాయో చెప్పలేకపోయారు.
సీఎం జగన్ ప్రకటించిన వివరాలు ప్రకారం 90 శాతం సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలు భరించి పది శాతం ప్రభుత్వం భరించేలా స్కిల్ డెలవప్ మెంట్ ఒప్పందం జరిగింది. అందులో దాదాపుగా మూడు వేల కోట్లు సీమెన్స్ పెట్టాలి. కానీ అవేమీ పెట్టకుండానే ప్రభుత్వం పదిశాతం ఇచ్చింది. అవి దారి మళ్లాయనేది జగన్ చేసిన ఆరోపణ. కానీ ఒప్పందంలో ప్రాజెక్టు వాల్యూ 3700 కోట్లు ఇందులో 90 సీమెన్స్ పెడుతుందంటే దానర్థం. డబ్బులు తెచ్చి పెట్టండ కాదు.. సాఫ్ట్ వేర్..ఇతర స్కిల్ అనే సంగతిని జగన్ చెప్పలేదు. కానీ తెలియకుండా ఉంటుందా..?
ఇక ప్రభుత్వం విడుదల చేసిన పదిశాతం వాటా 371 కోట్లు దారి మళ్లాయని అవిచంద్రబాబుకు తిరిగి వచ్చాయని చెప్పారు. కానీ ఒప్పందంలో ఉన్నట్లు స్కిల్ డెలవప్ మెంట్ సెంటర్లు ఊరకనే ఎందుకు పెడతారనే సంగతిని జగన్ చెప్పలేకపోయారు. ఆ డబ్బులు దారి మళ్లి పోతే.. చంద్రబాబుకు ఎలా చేరాయో కూడా చెప్పాల్సింది. చంద్రబాబుకు చెందిన హిరెటేజ్ కో లేకపోతే మరో బినామీ కంపెనీకో వచ్చాయని నిరూపించే పత్రాలు ప్రవేశ పెట్టి ఉండాల్సింది. కానీ అవేమీ చేయలేదు. కానీ చంద్రబాబుకు చేరాయని.. స్కిల్ తో చేసిన స్కామ్ చేశారని మాత్రం అదే పనిగా ఆరోపించారు.
ఇక ఈ కేసులో ఈడీ విచారణ చేస్తోందని చెప్పారు.. నిజమే కానీ.. అది డిజైన్ టెక్ లాంటి సంస్థలు… జీఎస్టీ ఎగ్గొట్టాయని నమోదు చేసిన కేసు. జగన్ చేసిన ఆరోపణలకు ఆ కేసుకు సంబంధంఏముందో జగన్ చెప్పలేకపోయారు. చంద్రబాబుపై అవినీతి మరక వేద్దామని ప్రయత్నించి… అసెంబ్లీలో ముందుగా ప్రసగించి.. ఎడిటింగ్ చేసిన దాన్ని మీడియాకు ఇచ్చిన ఈ స్కాం వ్యవహారంలో ఇప్పటి వరకూ చేసిన ప్రచారాలే తప్ప.. కొత్తగా ఏమీ లేకపోవడంతో తుస్ మనిపించింది.