లోక్ సభ ఎన్నికల్లో వైసీపీకి చెందిన నలుగురు ఎంపీలు ఎవరికి మద్దతిస్తారంటే వారికి మరో ఆప్షన్ లేదు.. ఉన్నదల్లా బీజే్పీకి అడగకపోయినా సపోర్టు చేసే ఒకే ఒక్క ఆప్షన్. బీజేపీకి మద్దతుగా బటన్ నొక్కకపోతే తర్వాత ఏం జరుగుతుందో వారికి బాగా తెలుసు. అందుకే ..ఎన్డీఏ కూటమికి మరో నాలుగు ఓట్లు యాడ్ అయినట్లే. తాము ఇంకా నిర్ణయించుకోలేదని..బీజేపీ వాళ్లు అడిగారని మీడియాకు లీకులిస్తున్నారు కానీ.. అక్కడీ బీజేపీ మరొకరి మద్దతు కోరాల్సిన పని లేదు.
టీడీపీ, జనేసన, ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్నందున ఆ పార్టీలు విప్ జారీ చేస్తాయి. ఆ మేరకు ఎన్డీఏ కూటమికే ఓటు వేస్తారు. ఇటీవల ఎంపీలతో సమావేశం అయిన జగన్మోహన్ రెడ్డి తమ మద్దతు అంశాల వారీగా ఉంటుందని తెలిపారు. అంటే కేంద్ర ప్రభుత్వానికి అవసరమైనప్పుడు మద్దతు ఇస్తామని చెప్పినట్లయింది. ఇప్పుడు లోక్ సభ స్పీకర్ ఎన్నిక విషయంలోనూ బీజేపీకి మద్దతుగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కూటమిలో టీడీపీ, జనసేన ఉన్నప్పటికీ వైసీపీకి ఉన్న కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల బీజేపీకి మద్దతివ్వాల్సిన పరిస్థితి ఉంది
అడగకపోయినా వైసీపీ మద్దతు ఓంబిర్లాకు ఉంటుందని అందరికీ స్పష్టత ఉంది. ఒక వేళ ఓం బిర్లా అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తే వైసీపీ ఇండియా కూటమికి దగ్గర అవుతుందని బీజేపీ అనుమానిస్తుంది. అది వైసీపీకి కొత్త సమస్యలు సృష్టిస్తుంది. ఆ ధైర్యం మాత్రం జగన్ చేసే అవకాశం లేదు. అందుకే టీడీపీ , జనసేన ఎంపీల కంటే ముందే బీజేపీ అభ్యర్థికి వైసీపీ ఎంపీలు మద్దతుగా ఓటేస్తారు. తాము టీడీపీ , జనసేన ఉన్న కూటమికి మద్దతిస్తున్నామని అసలు సిగ్గుపడరు. వారి రాజకీయం అలాంటిదే మరి.