వైసీపీ కార్యకర్తల్ని ఎలాగోలా రోడ్ల మీదకు తీసుకు వచ్చేందుకు జగన్ టీం ప్రయత్నిస్తోంది. కొన్ని కార్యక్రమాలు ప్రకటించారు. బెంగళూరు నుంచి తాడేపల్లి క్యాంప్‌నకు వచ్చినప్పుడల్లా ఓ జిల్లా నేతల్ని పిలిపించుకుని ఎప్పుడూ చదివే ఓ స్క్రిప్ట్ చదవి వారిని రోడ్డెక్కిద్దామని ప్లాన్ చేస్తున్నారు.కానీ ఆయన చెబుతున్నమాటలు వైసీపీ నేతలు, కార్యకర్తల చెవికి ఎంత వరకు ఎక్కుతాయా అన్నది వైసీపీ నేతలకే తెలియడం లేదు. ఎందుంటే జగన్ తో సమావేశం అని పిలిచిన ఓ జిల్లా నుంచి పది మంది ముఖ్యనేతలు కూడా రావడం లేదు.
అధికారంలో ఉండి తాను రాజు మిగతా వాళ్లంతా సేవకులు అన్నట్లుగా ట్రీట్ మెంట్ ఇచ్చారు. ఇప్పుడు తాము అంతా సేవలు చేయలేమని తప్పుకుంటున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బావుకున్నది లేదు.. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి టీడీపీకి టార్గెట్ అవ్వాల్సిన అవసరం లేదని అనుకుటున్నారు. కానీ జగన్ మాత్రం.. ఏదో చేయాలని.. అది కూడా కార్యకర్తలే చేయాలని అనుకుంటున్నారు.కానీ ఎవరైనా రోడ్ల మీదకు వస్తారా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. సీనియర్ లీడర్లే ఎవరూ బయటకు రావడం లేదు. కనీసం రెండేళ్ల పాటు పార్టీ క్యాడర్ స్తబ్దత వీడటం కష్టమేనని చెబుతున్నారు.
ఈ లోపు జగన్ తనకు వచ్చే సవాళ్లను ఎదుర్కొని నిలబడితేనే ప్రయోజనం ఉంటుంది. లేకపోతే క్యాడర్ వేరే పార్టీల వైపు జారుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి కూటమి పార్టీలు చేరికలను హోల్డ్ లో పెట్టాయి. గ్రీన్ సిగ్నల్ రాగానే చాలా మంది ఆయా పార్టీల్లో చేరిపోతారు. అప్పుడు వైసీపీకి మరింత గడ్డు కాలం ఎదురు కానుంది.