విశాఖపట్నం విమానాశ్రయంలో తనపై జరిగిన దాడి వెనుక.. పెద్ద కుట్ర ఉందని.. జగన్ నమ్ముతున్నారో .. లేకపోతే.. దీన్ని ఇష్యూ చేస్తే పెద్ద రాజకీయం అవుతుందని ఆశించారో కానీ.. ఎట్టి పరిస్థితుల్లోనూ.. జాతీయ దర్యాప్తు సంస్థల విచారణ కావాల్సిందేనని పట్టుబట్టారు. ఈ కారణంగానే ఆయన పోలీసుల విచారణకు కనీస మాత్రం సహకరించలేదు. ఎంతగా అంటే.. కనీసం.. స్టేట్మెంట్ ఇవ్వడానికి కూడా నిరాకరించారు. ఆ తర్వాత రక్తం మరకలు అంటిన చొక్కాను.. సాక్ష్యంగా అప్పగించాలని పోలీసులు అడిగినా ఇవ్వలేదు. వారు కోర్టుకు వెళ్తే కానీ.. కోర్టులో ఆ సాక్ష్యాన్ని సమర్పించలేదు. చివరికి చార్జిషీట్ కూడా వేయనివ్వకుండా.. కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు. తమ బాధ్యతగా విశాఖపట్నం పోలీసులు విచారణ జరిపారు. ఆ వివరాలను రెండు రోజుల కిందటే బయటపెట్టారు. అంతటితో విశాఖ పోలీసుల పనైపోయింది. ఇప్పుడు.. జాతీయ దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగుతుంది.
ఎన్ఐఏ అధికారులు విచారణ ప్రారభించాలంటే.. ముందుగా… జగన్ నుంచి స్టేట్మెంట్ తీసుకోవాలి. అంటే ఈ కేసులో మొదటగా.. ఎన్ఐఏ అధికారులు జగన్ దగ్గరకే వెళ్లబోతున్నారు. దాడి జరిగిందని భావించిన తర్వాత ఫస్ట్ ఎయిడ్ తీసుకుని… హైదరాబాద్ వెళ్లడం దగ్గర్నుంచి… అసలు అంత పెద్ద దెబ్బ తగిలితే.. విమానంలో ఎలా ప్రయాణించగలిగారన్న దాని వరకూ ప్రతీ విషయాన్ని ఎన్ఐఏ అధికారులు బయటపెట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత జైల్లో ఉన్న శ్రీనివాసరావును ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ విషయంలో… జగన్ లాయర్ల బృందానికి కూడా తెలిసిన విషయం ఒకటి ఉంది…అదేమిటంటే.. ఎన్ఐఏ అధికారులు.. ఏపీ పోలీసుల నుంచి… మొత్తం రికార్డులను స్వాధీనం చేసుకుంటారు. విచారణ వివరాలు సహా. వారి విచారణ కూడా.. వాటి మీదే ఆధారపడి సాగుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. అయినప్పటికీ.. జగన్ మాత్రం.. జాతీయ భద్రతా సంస్థ దర్యాప్తే కావాలని కోరుకుంది.
నిజానికి ఎన్ఐఏ ఇలాంటి కేసును విచారించడం ఇదే ప్రథమం కావొచ్చు. ఉగ్రవాదల వ్యవహారాలకు సంబంధించిన విచారణను.. ఎన్ఐఏ ఎక్కుగా చేపడుతుంది. ఎయిర్పోర్టులో జరిగిన ఓ కోడికత్తి కేసు విచారణ చేపట్టడం ఇదే మొదటి సారి కావొచ్చు. ఎన్ఐఏ దర్యాప్తు రాజకీయ పరంగా బురద జల్లడానికి కాకుండా.. విష్పక్షిపాతంగా విచారణ జరగాల్సి ఉంది. నిజానికి… జగన్ దాడి తర్వతా హైదరాబాద్ వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆస్పత్రిలో చేరారు. ఢిల్లీ నుచి ఫోన్లు వచ్చాయని.. ఆ ప్రకారం చేశారని టీడీపీ నేతలు చెప్పుకొచ్చారు. ఇప్పుడు జాతీయ దర్యాప్తు సంస్థ చేతిలోకి విచారణకు వెళ్లింది. తాము చెప్పిన కోణంలోనే విచారణ జరపాలని.. లేకపోతే.. ఎన్ఐఏ కూడా… టీడీపీతో లింకప్ అయిందని.. రాసుకోవాల్సిన పరిస్థితులు సాక్షిలో కనిపించినా ఆశ్చర్యపోనవసరం లేదనే అభిప్రాయం… ఏపీలో వ్యక్తమవుతోంది.