ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దుకాణాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. సాధారణంగా పదకొండు గంటలకు ప్రారంభం కావాలి.. కానీ గంట, రెండు గంటల ఆలస్యంగా ప్రారంభించారు. ఈ కొద్ది సమయంలో పెంచిన యాభై శాతం ధరలను… ఖరారు చేశారు. ఏ బ్రాండ్‌పై.. ఏ లిక్కర్‌పై.. ఏ బీర్‌పై ఎంతెంత పెంచాలో ఖరారు చేశారు. మద్యం ధలను పెంచాలని ప్రభుత్వం ఉదయం అనుకుంది. నిన్నంతా మద్యం దుకాణాల వద్ద రచ్చ జరగడంతో.. కొత్త విధానం ప్రవేశ పెడితే ఎలా ఉంటుందా.. అని ఆలోచించినట్లుగా ప్రచారం జరిగింది. టోకెన్ సిస్టం పెట్టాలని అనుకుంటున్నట్లుగా కూడా చెప్పుకున్నారు. అందుకే ఒక రోజు గ్యాప్ ఇచ్చి ప్రారంభిస్తారేమో అనుకున్నారు.
కానీ ప్రభుత్వం వాటి గురించి తర్వాత ఆలోచించాలనుకుందేమో కానీ.. ముందుగా మరో యాభై శాతం వడ్డిస్తూ ఉత్తర్వులు జారీ చేసేసింది. పెంచిన ధరలను ఆన్ లైన్లో అప్ లోడ్ చేసిన తర్వాత మద్యం దుకాణాలు తెరవాలని..సంబంధిత అధికారులకు సమాచారం వెళ్లింది. ఉదయం పదకొండు గంటలకు.. మద్యం ధరలు ఎంతెంత పెంచాలో.. డిసైడ్ చేసి.. ఆన్ లైన్లోకి రేట్లు అప్ లోడ్ చేశారు. ఆ తర్వాత ఉద్యోగులు.. ప్రభుత్వ మద్యం దుకాణాలను ప్రారంభించారు. నిన్న పెంచిన రేట్ల మీద యాభై శాతం పెంచడంతో.. రెండు రోజుల వ్యవధిలో… మద్యంపై దాదాపుగా 75 నుంచి 80 శాతం వరకూ పెరిగినట్లుగా అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం ఏ బ్రాండ్ లిక్కర్ అయినా.. క్వార్టర్ .. రెండు వందల నుంచి మూడు వందల పైనే ఉంది. బీర్లు కూడా రెండువందలు దాటిపోయాయి. నిజానికి ఏపీలో ప్రఖ్యాత బ్రాండ్లు ఏమీ లేవు. అన్నీ లోకల్ డిస్టిలరీల బ్రాండ్లే. వాటి ధరలే… ప్రీమియం బ్రాండ్లకు రెట్టింపుగా ఉన్నాయి. ధరలు పెంచితే.. కొనుక్కునేవారు తగ్గిపోతారని ప్రభుత్వం గట్టి నమ్మకంతో ఉంది. అందుకే.. ధరలు పెంచినట్లుగా చెబుతున్నారు. అయితే విపక్షాలు మాత్రం…మాత్రం మద్యానికి అలవాటు పడిన వారు.. ఇంట్లో వస్తువుల్ని తాకట్టు పెట్టి అయినా తాగుతారని.. ఇది వాళ్ల రక్తాన్ని తాగడమేనని.. మండిపడుతున్నాయి.