ప్రభుత్వ భూముల అమ్మకాలకు లైన్ క్లియర్ అయింది. హైకోర్టు గ్రీన్ సిగ్నల్‌తో గ్రేటర్ పరిధిలో ఉన్న భూములను అమ్మడం ద్వారా ఖజానాను నింపుకోవాలని భావిస్తున్న సర్కార్‌కు రిలీఫ్ దొరికింది. భూముల అమ్మకాలను అపాలంటూ బీజేపీ నేత విజయశాంతి గత వారం కిందట హైకోర్టు ను ఆశ్రయించారు. కానీ కోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో ప్రభుత్వం వెంటనే అప్రమత్తమయింది. వేలాన్ని అడ్డుకోకుండా ఇప్పటికే సివిల్ కోర్టు లో కేవియట్ కూడా వేసింది . ఇక కోకాపేటలో 50ఎకరాల భూమిని వేలం వేయడానికి అడ్డంకులు తొలగిపోయినట్లే.
కోకా పేట భూములంటే… గోల్డ్ మైన్లని పేరు. అందుకే వివిధ రాష్ట్రాలకు చెందిన కంపెనీలు, అంతర్జాతీయ సంస్థలు. కూడా ఆన్ లైన్ బిడ్డింగ్ లో పాల్గొనేందుకు ఆసక్తి చతూపిస్తున్నాయి. వీటి అమ్మకం ద్వారా 5000 కోట్ల వరకు రావచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు. ఆన్ లైన్ భూముల వేలాన్ని కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంస్థ చేపడుతోంది. గతంలో ఉప్పల్ భగాయత్ భూముల వేలం కూడా ఇదే సంస్థ నిర్వహించింది. ఇప్పటికే మూడు సార్లు ఆన్ లైన్ బిడ్డింగ్ ద్వారా భూముల వేలం వేసిన హెచ్ఎండిఏకు మొదటి సారి 350 నుండి 400 కోట్లు వచ్చాయి. రెండో సారి , మూడో సారి కలిపి మొత్తం వెయ్యి కోట్లు రాబట్టింది.
అయితే ఇప్పటి వరకూ గృహనిర్మాణాల కోసం ప్రభుత్వం భూములను వేలం వేసింది. కానీ ఇప్పుడు బడా రియల్ ఎస్టేట్ సంస్థల కోసం అమ్మకాలు జరుపుతోంది. పెద్ద ఎత్తున ఆదాయం వస్తుందని కూడా అంచనా వేస్తున్నారు. విపక్షాలు సహజంగానే విమర్శలు చేస్తున్నాయి. పేదలకు ఇవ్వాల్సిన స్థలాలను ఖజానా నింపుకోవడానికి వాడుకుంటున్నారని ఆరోపిస్తున్నాయి. అియతే ఆర్థిక కష్టాల్లో ఉన్న సర్కార్‌కు ఈ భూమి ఆదుకుంటోంది.