ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక వ్యవస్థలన్నింటిని నిర్వీర్యం చేసింది. వ్యవస్థలను తమ చెప్పు,చేతుల్లో ఉంచుకునేందుకు ప్రాధాన్యత ఇచ్చిందన్న విమర్శలు మూటగట్టుకుంది. దాంతో ఎన్నికలను కూడా సరైన విధంగా నిర్వహించేందుకు వైసీపీ సహకరిస్తుందా..? అనే అనుమానాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. వీటిని నిజం చేస్తూ వైసీపీ కార్యకర్తలు రిగ్గింగ్ చేసేందుకు యత్నించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా రెంటాలకు చెందిన చేరెడ్డి మంజుల చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. వైసీపీ రిగ్గింగ్ ను అడ్డుకునేందుకు తాను ఏజెంట్ గా కూర్చున్నట్లు ఆమె తెలిపారు. తమ గ్రామంలో రిగ్గింగ్ కు పాల్పడటం సర్వసాధారణంగా మారడంతో ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకొచ్చేందుకు హైదరాబాద్ నుంచి వచ్చి మరీ ఏజెంట్ గా కూర్చున్నట్లు వెల్లడించారు. అందుకే తనపై దాడి చేసినా పోలింగ్ నిష్పాక్షపతంగా జరిగేలా మొండి ధైర్యంతో వైసీపీ నాయకుల ప్రయత్నాలను అడ్డుకున్నానన్నారు.
అధికార పార్టీ కార్యకర్తల దాడితో నుదుటిపై గాయమై రక్తస్రవమైనా వెరవకుండా పోలింగ్ కేంద్రానికి బయల్దేరి వైసీపీ అరాచకానికి అడ్డునిలిచింది. బాధను భరిస్తూ పోలీసులు వచ్చే వరకు పోలింగ్ కేంద్రంలోనే ఉన్న ఆ మహిళా ఆ తర్వాత గురజాల ఆసుపత్రిలో చేరి ట్రీట్మెంట్ తీసుకుంది. ఓ సాధారణ మహిళా వైసీపీ రాజకీయాలపై ఎంత విసిగిపోయిందో ఆమె మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు.
కనీసం ప్రజాస్వామ్యయుతంగా ఓటు హక్కును వినియోగించుకునే స్వేఛ్చ లేని రాష్ట్రంగా ఏపీని మార్చారని ఆమె మాటల్లో ప్రస్పుటం అవుతోంది. అచ్చంగా సినిమా లెవల్ లో వ్యవస్థలను నిర్వీర్యం చేసినట్లు వైసీపీ కూడా అదే తరహాలో ఆధిపత్యం చేలాయించాలని చూసినట్లు స్పష్టం అవుతోంది.