ఆంధ్రప్రదేశ్‌లో తిట్టినా, కొట్టినా తామే చేయాలి.. ఎవరైనా ఎదురు మాట్లాడితే.. వారిపై కేసులు పెడతామన్నట్లుగా.. పాలకుల తీరు ఉంది. గౌరవనీయమైన మంత్రి స్థానంలో ఉండి బూతులు మాట్లాడుతూ.. కొడాలి నాని చెలరేగిపోతూంటే… పోలీసులు హాయిగా వింటూ ఉన్నారు. టీడీపీ నేతలు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోనట్లుగా ఉన్నారు. అయితే.. అదే కొడాలి నానిని.. ఓ మహిళ.. అదే లాంగ్వేజ్‌లో విమర్శించింది. ఆమె.. రాజధానిలో ఎర్రబాలెం గ్రామానికి చెందిన యలమంచిలి పద్మజ. రాజధానిపై బొత్స సత్యనారాయణ చేసిన స్మశానం వ్యాఖ్యలకు నిరసనగా.. జరిగిన ప్రదర్శన ఆమె కొడాలి నానిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో..పాలకులకు ఎక్కడో కాలినట్లుంది.
వెంటనే.. తమ అనుచరులతో… కృష్ణాజిల్లాలోని కంచిక చర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించారు. కొడాలి నాని అనుచరుడు ఒకరు ఫిర్యాదు చేయడంతో.. తమకు పెద్దల నుంచి ఆదేశాలున్నట్లుగా పోలీసులు ముందూ వెనుకా ఆలోచించకుండా కేసు పెట్టేసి.. ఎర్రబాలెం వచ్చి.. రహస్యంగా ఆమెను.. తీసుకెళ్లారు. కుటుంబసభ్యులు ఆమె కనిపించకపోయే సరికి.. తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పుడే.. తీరిగ్గా ఆమెను కంచికచర్ల పోలీసులు తీసుకెళ్లారని… ఆమెపై.. కొడాలి నాని ని తిట్టిన కేసు నమోదయిందని చెప్పారు. దీంతో.. టీడీపీ నేతలు… ఆమె బంధువుర్గవంలో ఒక్క సారిగా ఆగ్రహం వెల్లువెత్తుంది. పెద్ద ఎత్తున కంచిక చర్ల పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కంచికచర్ల పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకూడా స్టేషన్‌కు చేరుకొని నిరసనకు దిగారు.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై రాళ్లు, చెప్పులు వేస్తే.. నిరసనలో భాగం అని.. కేసు లు పెట్టకుండా… అరెస్టులు చూపకుండా.. తాత్సాహం చేసిన.. డీజీపీ, పోలీసులు ఇప్పుడు.. కొడాలి నానిని విమర్శించినందుకే… అరెస్టు చేయడం.. టీడీపీ శ్రేణులను విస్మయానికి గురి చేస్తోంది. పోలీసులను ఇలా కూడా వాడుకుంటారా… అని ప్రభుత్వం మండిపడుతున్నారు. పాలనకు వ్యతిరేకంగా మాట్ాడితే.. చట్ట వ్యతిరేక చర్యగా కనబడుతోందా..అని నారా లోకేష్ ప్రశ్నించారు. పద్మజకు మద్దతుగా.. టీడీపీ నేతలు పెద్ద ఎత్తున కంచికచర్లకు బయలుదేరుతున్న సమయంలో.. పరిస్థితులు అదుపు తప్పుతాయన్న ఉద్దేశంతో.. పోలీసులు ఆమెకు నోటీసులు ఇచ్చి వదిలి పెట్టేశారు. వెంటనే ఆమె తీవర్ స్థాయిలో విరుచుకుపడింది. పద్మజ కోసం.. లోకేష్ దగ్గర్నుంచి.. టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు వరకూ అందరూ స్పందించారు.
చంద్రబాబుగారి పై చెప్పులతో, రాళ్ళతో @ysjagan గారు దాడి చేయిస్తే పోలీసులకు అది భావ ప్రకటన స్వేఛ్ఛగా కనిపించింది. జగన్ గారి చెత్త పాలన చూసి కడుపు మండి ఒక మహిళ మాట్లాడితే పోలీసులకు అది చట్ట వ్యతిరేక చర్యగా కనిపించడం ఆశ్చర్యంగా ఉంది. పద్మజగారి అరెస్ట్ ని తీవ్రంగా ఖండిస్తున్నాను (1/3) pic.twitter.com/Jg4dIrOaH6
— Lokesh Nara (@naralokesh) December 3, 2019