పోలీసులు అయితే మాత్రం వారికి ఎఫైర్స్ ఉండకూడదా.. ! ఇంకా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే యూనిఫాం చూపించి మహిళల్ని లోబర్చుకోవచ్చు. ఇలాంటి పోలీసులు ఇటీవల ఎక్కువైపోతున్నారు. తాజాగా గుంటూరు జిల్లా ఎస్పీ ఆఫీసులో గ్రీవెన్స్ కు ఇద్దరు మహిళలు వచ్చారు. ఇద్దరూ ఒక సీఐతో సహజీవనం చేస్తున్నారు. ఆ సీఐ భార్యను ఇంట్లో పెట్టేసి.. ఈ ఇద్దరు ప్రియురాళ్లతో ఎప్పుడు ఎవరితో కుదిరితే వారితో టైం పాస్ చేస్తూంటారు.
అయితే ఇటీవల ఆ సీఐ.. ఈ ఇద్దరి దగ్గరకీ తరచుగా రావడం లేదు. దాంతో వీరిద్దరికీ డౌట్ వచ్చింది. అవతలి మహిళ దగ్గరకు ఎక్కువగా వెళ్తున్నాడేమో అని ఇద్దరూ అనుమానపడ్డారు. ఆ సీఐ సరిగ్గా స్పందించకపోవడంతో నేరుగా ఎస్పీకి ఫిర్యాదు చేద్దామని గ్రీవెన్స్ కు వచ్చారు. అక్కడ ఇద్దరూ ఎదురుపడ్డారు. తన దగ్గరకు రాకుండా అడ్డుకుంటున్నావంటే.. తన దగ్గరకు రాకుండా అడ్డుకుంటున్నావని ఇద్దరూ జుట్లు పట్టుకున్నారు. దీంతో అందరూ వారిద్దర్నీ విడదీయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది.
వారిద్దరూ ఎందుకు వచ్చారో.. ఎందుకు కొట్టుకుంటున్నారో అందరికీ తెలిసిపోయింది. అయితే విచిత్రంగా ఘర్షణ అనంతరం ఫిర్యాదు లు వెనక్కి తీసుకుని వెళ్ళిపోయారు. ఆ సీఐ తన సన్నిహితుల ద్వారా వారిద్దరికీ నచ్చచెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ సిఐ రాసలీలలు వ్యవహారం పై పోలీసు శాఖలో విస్తృత చర్చ జరుగుతోంది. ఆయనను బదిలీ చేసే అవకాశాలు ఉన్నాయి.