మహానగరంలో ఇంకా మానవత్వం బతికే ఉందని చాటారు మహిళా కండక్టర్. ఆర్టీసీ బస్సులో పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణీకి ఆర్టీసీ కండక్టర్ పురుడు పోసి మానవత్వం చాటుకున్నారు.
హైదరాబాద్ లోని ముషీరాబాద్ డిపోకు చెందిన 1Z రూట్ బస్సులో శుక్రవారం ఉదయం శ్వేతా రత్నం అనే గర్భిణీ ఆరాంఘర్ లో ఎక్కారు. బహదూర్ పూర వద్దకు రాగానే ఆమెకు పురిటి నొప్పులు తీవ్రమయ్యాయి. ఈ విషయాన్ని గమనించిన కండక్టర్ ఆర్.సరోజ అప్రమత్తమై మహిళా ప్రయాణికుల సాయంతో సాధారణ ప్రసవం చేశారు. ఆమె పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు.
అనంతరం మెరుగైన వైద్యం కోసం సమీపంలోని గవర్నమెంట్ మెటర్నటీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లిబిడ్డా క్షేమంగా ఉన్నారు.