ప్రజల్ని కట్టు బానిసలుగా చూడటం ఎలాగో వైసీపీ ప్రభుత్వాన్ని చూసి అర్థం చేసుకోవచ్చు. ప్రజలు పన్నులుగా కట్టిన సొమ్ములు, ప్రజల ఆస్తులను తాకట్టు పెట్టి తెచ్చిన సొమ్ములో ఓ పది శాతం అదే ప్రజల ఖాతాల్లో జమ చేస్తూ మిగతా అంతా అవినీతికి, జల్సాలకు ఖర్చూ.. ఆ పది శాతం ఇచ్చినందుకు తమను దేవుళ్లుగా కొలవాలని టార్చర్ పెడుతున్నారు. తమ ప్రతీ సమావేశానికి రావాలని లేకపోతే పథకలు రావని .. కోత పెడతామని.. హెచచ్చరికలు జస్తున్నారు. మాట కంటే ముందు ఇంట్లోకి దూరిపోయే వాలంటీర్ల భయంతో.. చాలా మంది మహిళలు బితుకుబితుకుమనాల్సి వస్తోంది.
ప్రభుత్వ పథకం అందుకుంటే చాలు వైసీపీకి కట్టు బానిస అన్నట్లుగా వ్యవహరించింది వైసీపీ ప్రభుత్వం. మహిళల్ని రాజకీయ సమావేశాలకు తప్పనిసరిగా హాజరయ్యేలా ఆదేశాలు ఇచ్చారు. ఎప్పటికప్పుడు హెచ్చరించి మరీ తీసుకెళ్లారు. చివరికి సీఎం జగన్ .. వెళ్తూంటే.. రోడ్లపై పూలు చల్లడానికి.. ప్లకార్డులు పట్టుకుని నిలబడటానికి ఉపయోగించుకుంది. రాష్ట్రంలో దాదాపుగా కోటి మంది డ్వాక్రా మహిళలు ఉన్నారు. వీరికి ఇచ్చింది ఎంతో కానీ వారి ఆత్మగౌరవంతో ఆడుకున్నది మాత్రం లెక్కలేనంత. ఎంత డ్వాక్రా మహిళలు అయినా .. ప్రభుత్వ పథకాల లబ్దిదారులు అయినా .. వారి వ్యక్తిగత జీవితాన్ని ఇబ్బంది పెట్టేలా ప్రభుత్వం వ్యవహరించకూడదు. కానీ ఈ ప్రభుత్వం అదే చేసింది.
జగన్ రెడ్డి ప్రభుత్వమే కొత్తగా పథకాలు ఇవ్వలేదు.. ఎన్టీఆర్ సమయం నుంచి పథకాలు ఉన్నాయి. ఏ ప్రభుత్వం వచ్చినా పథకాలు కొకనసాగుతాయి. ఈ ప్రభుత్వమే గత పథకాలను పక్కన పెట్టింది. పథకాలు.. పథకాలు అని ప్రచారం చేసుకుని అందు కోసం కూడా కోట్లు ఖర్చు పెడుతోంది. వైసీపీ ప్రభుత్వం తమను రాజకీయంగా ఉపయోగించుకుటున్న తీరు చూసి మహిళలు కూడా అసహ్యించుకుంటున్నారు. జగన్ సొమ్ము ఏదో తమకు ఇస్తున్నట్లుగా ఇంత రుబాబు చేయడం ఏమిటన్న ఆవేదన మహిళల్లో కనిపిస్తోంది. గత ప్రభుత్వాలు ఇలాంటి పనులు చేయనేలేదు.