తెలంగాణ సచివాలయాన్ని బీఆర్కే భవన్‌కు తరలించి.. ఆగస్టు పదమూడో తేదీ నుంచి అక్కడి నుంచే పూర్తి స్థాయిలో కార్యకలాపాలు జరగాలని… సీఎం కేసీఆర్… సీఎస్ ఎస్కే జోషిని నెల రోజులుగా ఆదేశిస్తున్నారు. జోషి కూడా.. కచ్చితంగా… అదే జరుగుతుందని చెబుతూ వచ్చారు. అధికారులకు పురమాయించారు. వారు కూడా… ఆగస్టు 13నుంచి బీఆర్కే భవన్ నుంచే పని చేద్దామని చెబుతూ వచ్చారు. కానీ.. తీరా ఆగస్టు 13వ తేదీ వచ్చే సరికి.. బీఆర్కే భవన్లో.. ఎప్పట్లాగే ఉంది. ఏ కార్యాలయమూ పూర్తి స్థాయిలో అక్కడికి చేరలేదు. అధికారులూ రాలేదు. వచ్చిన వారు.. బీఆర్కేభవన్ లో పరిస్థితులు చూసి.. మళ్లీ పాత సెక్రటేరియట్‌కు వెళ్లిపోయారు. దీంతో సెక్రటేరియట్ తరలించలేకపోయారని.. సీఎం కేసీఆర్… సీఎస్ ఎస్కే జోషిపై మండిపడ్డారు. అందరి ముందు.. కటువుగా మాట్లాడటంతో.. ఆయన హతాశుడయ్యారని ప్రచారం జరుగుతోంది.
కూలగొట్టేందుకు అనువుగా.. పాత సచివాలయాన్ని ప్రభుత్వం ఖాళీ చేయాలని నిర్ణయించింది. వివిధ భవనాలను ప్రత్యామ్నాయాలుగా సిద్ధం చేసుకున్నారు. కానీ.. అఘమేఘాల మీద తరలించడం అధికారుల వల్ల కాలేదు. దీంతో మంగళవారం నుండే పూర్తి స్థాయిలో బిఆర్కే భవన్ నుంచే పాలన చేపట్టాలన్న ప్రభుత్వ ఆదేశాలు అమలు కాలేదు. బిఆర్కే భవన్లో ఇంకా విద్యుద్దీకరణ,రంగులు వేయడం,టాయిలెట్ల మరమ్మత్తు పనులు ఇంకా చేస్తున్నారు. అన్ని ఫ్లోర్ లలో కుప్పలు,కుప్పలుగా చెత్త పోగై ఉంది. ఇంటర్నెట్,కేబుల్ వర్క్ ఇంకా మొదలు కాలేదు. దీంతో ఇక్కడి నుండి కార్యకలాపాలు నిర్వహించాలంటే కనీసం నెల రోజులు పడుతుందని ఉద్యోగులు చెప్తున్నారు
సీఎం ఆగ్రహంతో… ఎది ఏమైనా తాను తాను మాత్రం బిఆర్కే భవన్ నుండే కార్యకలాపాలు చేపడతానని సిఎస్ ఎస్కే జోషి సిబ్బందికి చెప్పారు. కానీ ఆయన కూడా… అక్కడి పరిస్థితి చూసి… ఇంటికెళ్లిపోయారు. అయినా సరే తాను పాత సెక్రటేరియట్ వైపు రానని ఫైళ్ల అవసరం ఉంటే నేరుగా ఇంటికే రావాలని ఆదేశించారట. అంటే.. ఇక తెలంగాణ అధికారులంతా.. ఆయన బాటే పడితే.. వర్క్ ఫ్రమ్ హోమ్… అమలవుతుందన్నమాట..!