తెలుగు సినీ నిర్మాత, పత్రికాధినేత, స్టార్ పి ఆర్ ఓ., బి ఏ రాజు తనయుడు, బి.శివకుమార్ దర్శకుడిగా పరిచయం అవుతూ ‘వర్కవుట్ అయ్యింది’ పేరుతో ఓ వెబ్ సిరీస్ ప్రారంభించాడు. ‘మా ఆయి’ పతాకంపై రూపేష్ కుమార్ చౌదరి నిర్మిస్తున్న వెబ్ సిరీస్ డిసెంబర్ 17న షూటింగ్ ప్రారంభమై ఈ జనవరి 5 తో పూర్తి షూటింగ్ చేసుకుంటుంది. పూర్తిగా హైదరాబాద్‌లోని పలు లొకేషన్స్‌లో ఈ సిరీస్ సినిమా రేంజ్ లో షూటింగ్ జరిగింది.
ఈ సందర్భంగా దర్శకుడు బి శివ కుమార్ మాట్లాడుతూ – ” ప్రముఖ దర్శకులు పూరి జగన్నాథ్, వి వి వినాయకలవద్ద దర్శకత్వ శాఖలో పలు చిత్రాలకు పని చేశాను. ఆ అనుభవంతో ఇప్పటి జనరేషన్ లో సినిమా కున్న ఆదరణ వెబ్ సిరీస్ కి కూడా వుంది కాబట్టి, దర్శకుడిగా ఇది నా తొలి ప్రయత్నం. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ లో, నెట్ ఫ్లెక్స్ లో…వెబ్ సిరీస్ కి మంచి రేటింగ్ వుంది. అలాగే యూట్యూబ్ ఛానల్ లో కూడా వెబ్ సిరీస్‌ల వీవర్ షిప్ మిలియన్స్ లో ఉంటుంది. టి వి సీరియల్ లా కాకుండా సినిమా రేంజ్ లో తీయగలిగితే యంగ్ జనరేషన్ తప్పక చూస్తారు. ‘వర్కౌట్ అయ్యింది’ కూడా సినిమా రేంజ్ లోనే ఎక్కడ కంప్రమైస్ కాకుండా రెడ్ కెమెరా తో షూట్ చేసాము. ఈ స్క్రిప్ట్ లో థ్రిల్లింగ్, యూత్ ఫన్నీ ఎలిమెంట్స్ బాగా ఆకట్టుకుంటాయి” అన్నారు.
రూపేష్‌కుమార్ చౌదరి, మీనాకుమారి, చక్కని, రాంబాబు వర్మ, శశిధర్, సూర్య, ఫన్ బకెట్ ఫణి, ఫన్ బకెట్ భార్గవి, ఇషాని, ఫణీంద్ర, మోడబుల్ గై, రాహుల్ కొసరాజు నటిస్తున్న ఈ వెబ్ సిరీస్‌లో ప్రముఖ డాన్స్‌మాస్టర్ అనీ లామా కీలక ప్రాతలో నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌కు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: బి.వి.రవికిరణ్ తో కలిసి దుర్గా కిషోర్, ప్రొడక్షన్: రమేష్, ఎడిటింగ్: శ్యామ్ వాడవల్లి, మేనేజర్: కిరణ్, పోస్ట్ ప్రొడక్షన్: గ్జిన్స్ స్టూడియో, పి ఆర్ ఓ : బి ఏ రాజు, కో-డైరెక్టర్: అనిల్‌కుమార్ బి., మాటలు: డా.చల్లా భాగ్యలక్ష్మి, నిర్మాత: రూపేష్‌కుమార్ చౌదరి, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: బి.శివకుమార్.