ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం అప్పు ఇవ్వడానికి ప్రపంచ బ్యాంకు సూత్రప్రాయంగా ఆమోదించింది. రోడ్లు, మురుగునీరు, వర్షపునీటి పారుదల, చెత్త నిర్వహణ వంటి సదుపాయాలకు మాత్రమే రుణాలు ఇస్తున్న ప్రపంచబ్యాంకు ఒక రాజధాని నిర్మాణానికి లోన్ ఇవ్వడం ఇదే మొదటి సారి కావచ్చు!
రాజధాని ప్రాంత గ్రామాల్లో సదుపాయాలు, వరద నిర్వహణ, రహదారి వ్యవస్థలకు రుణం ఇవ్వడానికి ప్రపంచబ్యాంకును రాష్ట్రం రూ.6వేల కోట్లు కావాలని ప్రభుత్వం కోరింది. దీంతో ప్రపంచబ్యాంకు బృందం రాజధాని ప్రాంతానికి ఉన్న అవసరాలను పరిశీలించేందుకు వచ్చింది. అనంతరం ప్రతిపాదిత మొత్తంలో 30 శాతం నిధులు విడుదల చేసేందుకు సిద్ధమైంది.
ప్రపంచ బ్యాంకు బృందం నాలుగు రోజులుగా రాజధాని ప్రాంతంలో పర్యటించింది. దనిలో మౌలిక వసతుల కల్పనకు అందించే ఆర్థికసాయం, పేదల అనుకూల పట్టణ మౌలిక వసతులు, పర్యావరణ అనుకూల పట్టణ సౌకర్యాలు, సాంకేతిక సహకారం అనే విభాగాలుగా విభజించి అందించడం జరుగుతుంది. అలాగే అమరావతి నగర సుస్థిర అభివృద్ధి ప్రాజెక్టు సమాచారం దాని పరిధిలో ప్రజలందరికీ తెలియజేయాలని బృందం సిఆర్డిఏకు సూచించింది.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో వీటిని వినియోగించుకునేందుకు వీలుగా 30 శాతం కేటాయింపులు చేస్తామని, డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు ను వెంటనే (డిపిఆర్)ను వెంటనే అందజేయాలని ప్రపంచబ్యాంకు టీమ్ లీడర్ రఘు కేశవన్ సిఆర్డిఏ అధికారులకు సూచించారు. అమరావతి సస్టెయినబుల్ క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్ ప్రాజెక్టు(ఎఎస్సిసిడిపి) అమలుకు సంబంధించి ప్రాజెక్టు కాన్సెప్ట్ నోట్ (పిసిఎన్)కు ఆమోదం లభించిందని కేశవన్ ప్రకటించారు.
ప్రపంచీకరణ, డిజిన్వెస్ట్ మెంటు పాలసీలు, విదేశీ పెట్టుబడులకు ప్రోత్సాహం మొదలైన ధోరణుల గురించి లోతైన అవగాహన, ఆసక్తి వున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ప్లానింగమీషన్ స్ధానంలో నీతీ ఆయోగ్ ఏర్పడినపుడే, ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమైనపుడే ”అమరావతి” నిర్మాణానికి కేంద్రం నుంచి వచ్చేదేమీ లేదని అర్ధమైపోయింది.
ఆంధ్రప్రదేశ్ కు వున్న వనరులు, రాబడుల దృష్ట్యా అంతర్జాతీయ ద్రవ్యసంస్ధల నుంచి అప్పులు తీసుకురావడం కష్టం కాదని లెక్కతేల్చుకుని ఆదిశగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. ముందుగా ప్రపంచబ్యాంకుకి అప్లై చేశారు. మేనెలలో ఒక టీమ్ వచ్చి ఫీల్డు ఇన్ స్పెక్షన్ చేసి ప్రాజెక్టులో మార్పులు చేర్పులు సూచించింది. ఆసవరణలు జరిగాక ఇపుడు రెండో తనిఖీ జరిగింది. 6 వేల కోట్ల రూపాయల రుణానికీ తొలిదశలో 30 శాతం ఇవ్వడానికి ఒప్పుకోవడంతో అప్పు ఖరారైపోయినట్టే!
ఇపుడున్న ఆర్ధిక వాతావరణంలో అప్పు తెచ్చుకోవడం ఏరాష్ట్రానికైనా పెద్ద సమస్య కాదు. అందుకు కేంద్రం ఆమోదించాలి. కేంద్రం తిరస్కరించనవసరంలేదు. పెండింగ్ లో వుంచనవసరంలేదు. కొర్రీల మీద కొర్రీలు వేసి ఫైలు అదేపనిగా వెనక్కి పంపవలసిన అవసరం కూడా లేదు. ఫైలు ఓ పక్కన పడేసి, అడిగినపుడల్లా “పరిశీలిస్తున్నాం” అని చెబుతూ సంవత్సరాలకు సంవత్సరాలే దొర్లించేయవచ్చు. కేంద్రానికీ, రాష్ట్రానికీ వున్న రాజకీయ సంబంధాలను బట్టే ఫైల్ క్లియర్ చేయడమో, చెయ్యకపోవడమో, నాన్చడమో వుంటుంది.
బిజెపితో తెలుగుదేశం తెగతెంపులు చేసుకోకపోవడానికి బహుశ ఇది కూడా పెద్ద కారణం కావచ్చు