అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ ..అల్ ఖైదా దాడుల తర్వాత ప్రపంచం మొత్తం తెలిసింది. కానీ అలా తెలిసే సరికి అది కాలగర్భంలో కలిసిపోయింది. మళ్లీ అక్కడ నిర్మించినా అంత ఫేమస్ కాలేదు. కానీ అలాంటి దానికి మంచిని ప్రపంచ దేశాల వాణిజ్యం అంతా కేంద్రీకృతమయ్యేలా ఓ ట్రేడ్ సెంటర్ ను నిర్మించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇతర దేశాల్లో వాణిజ్య కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు వరల్డ్ట్రేడ్ సెంటర్స్ అసోసియేషన్ రైట్స్ తీసుకుంది. తెలంగాణలో మొదటి వాణిజ్య కేంద్రాన్ని హైదరాబాద్లో నిర్మిస్తున్నారు.
ఫ్యూచర్ సిటీ-4.O లో ఏఐ సిటీని నిర్మించాలని రేవంత్ ఇప్పటికే నిర్ణయించారు. అలగే వరల్డ్ ట్రేడ్ సెంటర్ నూ ప్రతిపాదిస్తున్నారు. ఇప్పటికే వరల్డ్ ట్రేడ్ సెంటర్ ప్రతినిధులతో ఒప్పందం జరిగింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ కు అనువైన ప్రాంతాన్ని ఎంపిక చేసే కసరత్తు నిర్వహిస్తున్నారు. ఏఐ సిటీకి ప్రతిపాదించిన స్థలం సమీపంలో మూడు ప్రాంతాల్ని ఎంపిక చేశారు. వాటికి సంబంధించి పూర్తి సానుకూలతలు, అననుకూలతల నివేదికలను సమర్పించనున్నారు.
ఎయిర్ పోర్ట్, మెట్రోరైల్ స్టేషన్లకు వేగంగా చేరుకునేందుకు వీలుగా ప్రధాన రోడ్డుతో పాటు, ఇంటర్నల్ రోడ్లు వరల్డ్ ట్రేడ్ సెంటర్ కు అనుసంధానమై ఉండేలా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. మొత్తంగా 70 ఎకరాల స్థలంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ను నిర్మించే అవకాశం ఉంది. సోలార్ పవర్ ప్లాంట్ తో పాటు, కమ్యూనికేషన్ వ్యవస్థ కోసం భారీ టవర్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇలా అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఫోర్త్ సిటీలోనే భూమిని ఖరారు చేయనున్నారు.