నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. దీనికి టైటిల్ ఇంకా ఖరారు కాలేదు. అయితే రిలీజ్ డేట్ మాత్రం దగ్గర పడుతోంది… మే 28న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని చిత్రబృందం ఇది వరకే ప్రకటించింది. అయితే ఇప్పటికి ఇంకా 40 శాతం షూటింగ్ బాకీ ఉందని సమాచారం. ఒక్క రోజు కూడా బ్రేక్ తీసుకోకుండా… పనిచేయగలిగితేనే.. ఈ సినిమా అనుకున్న సమయానికి విడుదల చేసే అవకాశం ఉంది.కరోనా కేసులు పెరుగుతుండడం, మళ్లీ లాక్ డౌన్ భయాల మధ్య… చిత్రసీమలో మళ్లీ టెన్షన్ మొదలైంది. ఎప్పుడు ఎలాంటి అవాంతరాలు వస్తాయో చెప్పలేం. మళ్లీ లాక్ డౌన్ విధించేది లేదు.. అని తెలంగాణ ప్రభుత్వం గట్టిగా చెబుతున్నా – ఎవరి భయాలు వాళ్లకున్నాయి. ఈ నేపథ్యంలో అనుకున్న సమయానికి ఈ సినిమాని సిద్ధం చేయగలమా? లేదా? అంటూ బోయపాటి శ్రీను యోచిస్తున్నట్టు టాక్. వీలైనంత వరకూ… మూడు షిఫ్టులలో పనిచేసి.. ఈ సినిమాని పూర్తి చేయాలని భావిస్తున్నాడు.
* టైటిల్ ఏమిటి?
టైటిల్ విషయంలోనూ బోయపాటి శ్రీను ఓ నిర్ఱయానికి రాలేకపోతున్నాడు. `మోనార్క్` అనే పేరు బయట బాగా వినిపిస్తోంది. అయితే ఈ టైటిల్ పట్ల.. బాలకృష్ణ విముఖత చూపిస్తున్నాడట. బోయపాటి కూడా కొత్త టైటిల్ కోసం గట్టిగానే అన్వేషిస్తున్నాడు. `బిబి 3` అనేది వర్కింగ్ టైటిల్. దాన్నే ఫిక్స్ చేసేస్తే `ఆర్.ఆర్.ఆర్`లా జనంలోకి సులభంగా వెళ్లిపోతుందేమో అన్న ఆలోచన కూడా ఉంది. మరి బోయపాటి ఏం చేస్తాడో చూడాలి.