వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం.. ఆ పార్టీ అధినేత కోసం… హైదరాబాద్లో కూర్చుని గొంతెత్తిన కొంత మంది సెలబ్రిటీలు వరుసగా.. జగన్ సమక్షంలో కండువా కప్పించేసుకుంటున్నారు. వారం రోజుల కిందట ఫీజు రీఎంబర్స్మెంట్ రాలేదంటూ.. తన కాలేజీ విద్యార్థులతో కలిసి రోడ్డెక్కిన మోహన్ బాబు.. చంద్రబాబును దారుణంగా తిట్టిపోశారు. ఆ తర్వాత ఏ మాత్రం సంకోచం లేకుండా రెండు రోజుల్లోనే.. లోటస్పాండ్లో ప్రత్యక్షమయ్యి… జగన్తో కండువా కప్పించుకున్నారు. హైదరాబాద్లో ఆంధ్రులపై దాడులు చేస్తున్నారన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై… ప్రత్యేకంగా ప్రెస్మీట్ పెట్టి మరీ.. చెలరేగిపోయిన చిన్ని కృష్ణ అనే రచయిత కూడా.. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తో కండువా కప్పించుకున్నారు. తూ.గోజిల్లాకు వెళ్లి మరీ చిన్ని కృష్ణ పార్టీలో చేరారు.
ఇక అదే సమయంలో.. కోన వెంకట్.. కూడా… జగన్ కోసం… వైసీపీ కోసం.. నోరు చేసుకున్న వారిలోఉన్నారు. అయన ప్రత్యేకంగా వైసీపీలో చేరాల్సిన పని లేదని.. ఎప్పటి నుండో వైసీపీలో ఉన్నారని … చెబుతున్నారు. ఆయన బాబాయ్ కోన రఘుపతి.. వైసీపీ తరపున బాపట్ల నుంచి పోటీ చేస్తున్నారు. దాంతో ఆయన వైసీపీలో ఉన్నట్లే అనుకోవాలి. ఇప్పటికే పోసాని కృష్ణమురళి.. వైసీపీలో కండువా కప్పించుకోలేదు కానీ… ఏకపక్షంగా జగన్ ను సీఎం చేయాలని పిలుపునిస్తున్నారు. టాలీవుడ్లోఇంకా కొంత మంది … ఇలా బయటకు వస్తారని.. వాళ్ల ఇంటర్యూల ద్వారా..ముందుగా… జగన్ను పొగడకుండా.. ప్రత్యర్థుల్ని తిట్టి.. ఆ తర్వాత జగన్ సమక్షంలో కండువా కప్పించుకుంటారని చెబుతున్నారు.
ఈ జాబితాలో నెక్ట్స్.. శివాజీ రాజా ఉంటారని చెబుతున్నారు. నిన్నామొన్నటిదాకా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న శివాజీ రాజా.. ఇప్పుడు.. ఖాళీగానే ఉన్నారు. ఆయనకు కొన్నాళ్లుగా సినిమా చాన్సులు కూడా లేవు. ఈ క్రమంలో ఆయన వైసీపీలో చేరుతారని ప్రచారం జరిగింది. 24వ తేదీన జగన్ సమక్షంలో కండువా కప్పుకుంటారని చెప్పుకున్నారు కానీ… అలాంటిదేమీ జరగలేదు. ఓ ప్రత్యేకమైన సందర్భం.. ఇంటర్యూ… ఇచ్చిన తర్వాత ఈ చేరిక ఉండవచ్చని అంటున్నారు. మొత్తానికి వైసీపీ నేతలు.. ఎదురు పార్టీ నేతల్ని తిట్టించడానికి పలుకుబడి ఉన్న వారినే ఎంచుకుంటున్నారనే సెటైర్లు పడుతున్నాయి.