సాధారణంగా రచయితలు దర్శకత్వం వైపు అడుగులేస్తుంటారు. నాలుగైదు సినిమాలు చేశాక, ఓ హిట్ అందుకొన్నాక వాళ్ల దృష్టి దర్శకత్వం వైపే ఉంటుంది. కానీ.. రచయిత లక్ష్మీ భూపాల్ మాత్రం అలా కాదు. నిర్మాణ రంగంలోకి అడుగుపెడదామనుకొంటున్నారు. చందమామ, అలా మొదలైంది, నేనే రాజు నేనే మంత్రి సినిమాలతో రచయితగా పేరు తెచ్చుకొన్నారు లక్ష్మీ. ఆయన పాటలూ రాస్తున్నారు. ఇప్పుడు లక్ష్మీభూపాల సినిమా థియేటర్ పేరుతో ఓ సంస్థని స్థాపించి సినిమాలు తీద్దామని డిసైడ్ అయ్యారని టాక్. కొత్త తరహా కథలకు పట్టం కట్టే ఆలోచనతోనే ఈ ప్రయత్నం చేస్తున్నార్ట. ఇప్పటికే రెండు కథలు ఒకే చేశారని, ఓ యువ దర్శకుడ్ని ఈ బ్యానర్ ద్వారా పరిచయం చేయాలనుకొంటున్నారని తెలుస్తోంది. ఈ చిత్రానికి కథ, మాటలు ఆయనే అందిస్తున్నార్ట. అంతేకాదు… త్వరలోనే లక్ష్మీ భూపాల్ దర్శకత్వం వహించడానికి సన్నాహాలు చేసుకొంటున్నారని వినికిడి. ఇప్పటికే ఓ పేరున్న సంస్థ లక్ష్మీభూపాల్కి అడ్వాన్సు ఇచ్చిందని, ఆ బ్యానర్లో సినిమా చేయడానికి రెండు మూడు కథల్నీ సిద్ధం చేస్తున్నారని సమాచారం.