మొన్న శనివారంనాడు ప్రత్యేకహోదా కోసం కాంగ్రెస్ పార్టీ తిరుపతిలో నిర్వహించిన బహిరంగ సభలో ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్య ప్రయత్నం చేసిన ముని కామకోటి అనే యువకుడు నిన్న చెన్నైలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించాడు. పోస్ట్ మార్టెం చేసిన తరువాత పోలీసులు అతని శరీరాన్ని అతని కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. అనంతరం వారు అతని అంత్యక్రియలు తిరుపతిలో నిర్వహిస్తారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్రజలను మోసం చేస్తున్న అధికార తెదేపా, బీజేపీలే ముని కామకోటి మృతికి కారణమని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ ఈరోజు తిరుపతి బంద్ కి పిలుపిచ్చింది.