ఆధార్ కార్డులతో ఓటరు కార్డుల అనుసంధానం ప్రక్రియకు సుప్రీం కోర్టు ఈరోజు బ్రేక్ వేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు వాటి అనుసంధాన ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఆధార్ తో కేవలం సబ్సీడీ గ్యాస్, రేషన్ కార్డుల అనుసంధానానికి మాత్రమే అనుమతించింది. కనుక అన్ని రాష్ట్రాలలో తక్షణమే ఆధార్ అనుసంధానం నిలిపివేయవలసి వచ్చింది. దేశంలో కొన్ని లక్షల బోగస్ ఓటర్లు, ఒకే వ్యక్తికి రెండు మూడు ప్రాంతాలలో ఓటరు కార్డులు ఉన్నట్లు గుర్తించిన ఎన్నికల సంఘం వాటిని తొలగించేందుకే ఆధార్ కార్డులతో అనుసంధానం చేయాలనుకొంది. కానీ సుప్రీం కోర్టు బ్రేకు వేయడంతో ఈ సమస్య పరిష్కారానికి వేరే మార్గం అన్వేషించవలసి ఉంటుంది.