మనుశర్మ : నేను జంధ్యం కడతా..కోన..! కానీ జగన్‌కే ఎందుకు ఓటేయాలి..?
అది 2005, సెప్టెంబర్ 26..!
ఏపీ ప్రభుత్వం జీ.ఓ. నెంబర్ 338 రిలీజ్ చేసింది..!
ఈ జీవో సారాంశం.. శ్రీనివాసుడు వేంచేసి ఉన్న తిరుమల.. ఏడు కొండలు కాదు.. రెండు కొండలే..అని..!
“ఏడు కొండల వాడా.. గోవిందా.. గోవింద..” అని శ్రీవారి భక్తులు పడిన ఆవేదన అంతా ఇంతా కాదు.
ఈ జీవో విడుదల చేసే సమయానికి.. వైఎస్ ముఖ్యమంత్రిగా అయి.. గట్టిగా ఏడాదిన్నర. ఈ లోపే ఆయన ఓ సారి జెరూసలెం వెళ్లి .. తన సంప్రదాయక రాజకీయ వస్త్రధారణ అయిన పంచెను పక్కన పెట్టి.. సూటుబాటు వేసుకుని.. జీసస్‌ను దర్శించుకుని వచ్చారు. నాస్తికుడిగా ప్రచారంలో ఉండి.. నక్సలైట్ ఉద్యమాల్లో పని చేసి… జన జీవన స్రవంతిలో కలిసిన భూమన కరుణాకర్ రెడ్డికి అప్పటికే టీటీడీ చైర్మన్ పోస్ట్ ఇచ్చారు. ఆయన నాస్తికుడో కాదో .. కానీ.. ఆయన ఇంట్లో అందరూ క్రిస్టియానిటీ పాటిస్తారన్న ప్రచారం ఉంది. పైగా.. ఆయనకు పదవి ఇచ్చిన మార్గదర్శి వైఎస్… క్రైస్తవాన్ని… తరాలుగా ఆచరిస్తున్నారు. ఇక తిరుమలలో ఇలాంటి అరచకాలకు.. అప్పుడో ప్రారంభోత్సవాలు జరిగాయి.
ఐదు కొండలపై కన్నేసిన వైఎస్ అండ్ గ్యాంగ్..! :
తిరుమల రెండు కొండలే అని చెప్పడానికి … కూడా చాలా పెద్ద కసరత్తే చేశారు. నేరుగా న్యాయస్థానం ద్వారానే కన్ఫర్మ్ చేయిస్తే.. సమస్య ఉండదని.. ఆ నాటి వైఎస్ సర్కార్ పెద్దలు ఆనుకున్నారు. ఓ అనుంగు అనుచరుడితో… తిరుమలను పంచాయతీగా గుర్తించి ఎన్నికలు పెట్టాలని.. పిటిషన్ వేయించారు. దీనికి కౌంటర్‌గా తిరుమల అంటే.. రెండు కొండలేనని… అఫిడవిట్ వేసేశారు. అసలు పంచాయతీ ఎన్నికలు పెట్టాలనేదానికి… తిరుమల విస్తీర్ణం ఎంత అనే దానికి సంబంధం ఏమిటి..?. అది ఆధ్యాత్మిక ప్రాంతం.. రాజకీయాలు చేయకూడదని చెబితే.. న్యాయస్థానాలు అంగీకరించవా..? పని గట్టుకుని.. రెండు కొండలు మాత్రమే తిరుమల…మిగతా మొత్తం ఐదు కొండలు… అటవీ ప్రాంతం… అని డిక్లేర్ చేయడానికి చాలా లోతైన కారణం ఉంది. ఆ ఐదు కొండల్ని మిషనరీ సంస్థలకు.. మైనింగ్‌కు… అందులో ఉన్న ఖరీదైన ఎర్రచందనంపై దృష్టి పెట్టి.. ఇలా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ రెండు కొండల జీవోపై.. హిందూత్వ వాదులంతా.. దండయాత్రకు సిద్ధమవడంతో.. వెనక్కి తగ్గారు. శేషాద్రి, నారాయణాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వెంకటాద్రి, ౠషబాద్రిని తిరుమల కొండలుగా గుర్తిస్తూ.. మరో జీవో జారీ చేశారు. కానీ తిరుమల విషయంలో విధ్వంసం మాత్రం ఆగలేదు.
వైఎస్ హయాంలో తిరుమలలో జీసస్ గుర్తులెందుకొచ్చాయి..? :
భూమన కరుణాకర్ రెడ్డి.. టీటీడీ చైర్మన్ గా ఉన్నంత కాలం…. కొండపై.. శిలువ గుర్తులు.. పదే పదే కనిపించేవి. అన్యమతస్తులు.. ప్రత్యేకంగా… ప్రచార కార్యక్రమాలు పెట్టేవారు. దానికి కాటేజీలు… వేదికలయ్యేవి. ఎన్ని సార్లు తిరుమల ఈ విధంగా వివాదాస్పదం అయిందో భక్తులు చూశారు. బ్రహ్మోత్సవాల సమయంలో వేసే లైటింగ్ చూస్తే.. చర్చిలకు వేసినట్లుగా ఉండేంది. దూరం నుంచి చూస్తే.. శిలువలే సాక్షాత్కరించేవి. నిజానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రిస్టియన్ మిషనరీస్ గురి.. తిరుమలపై ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధ హిందూ పవిత్ర స్థలంగా ఉన్న తిరుమల పవిత్రతను చెడగొట్టడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. ఆ సమయంలోనే… ఇదేమి కలికాలం అని .. మనసులో బాధపడటం… తప్పా.. మరేమీ చేయలేని నిస్సహాయ స్థితి నాటి భక్తులది. వెంకటేశ్వరుడ్ని.. వెంకటేశ్వరుడే కాపాడుకోవాలన్నది భక్తుల కోరిక. ఆయన భక్తుల కోరికను మన్నించారు. తర్వాతి కాలంలో.. మళ్లీ తిరుమలకు అన్యమత వాసనలు అంటలేదు.
శ్రీనివాసుడిపై నమ్మకం లేని వారికి బ్రాహ్మణులు పట్టం కట్టాలా..? :
వైఎస్ హయాంలో క్రిస్టియన్ ముద్ర బాగా పడిపోయింది. మత మార్పిళ్లు యథేచ్చగా సాగిపోయాయి. సొంత అల్లుడ్ని కేఏ పాల్ అంతటి మత ప్రబోధకుడిగా మార్చడానికి .. ఆ కేఏ పాల్‌ను రోడ్డు మీదకు తీసుకొచ్చిన ఘనత వైఎస్ సొంతం. వైఎస్ అల్లుడుగారు చేసే తమ ప్రచారం.. ఇప్పటికీ ఉద్ధృతంగానే ఉంది. వైఎస్ సతీమణి, జగన్ తల్లి విజయమ్మ చేతిలో బైబిల్ పట్టుకోకుండా బయటకు రారు. జగన్ తన రాజకీయ అవసరం కోసం.. తిరుమలకు వెళ్తారు. కానీ.. దండయాత్రలా వెళ్తారు. పులివెందుల చర్చికి కూడా ఆయన వెళ్తారు. లోపల ఒక్క నినాదమూ వినిపించదు. సైలెంట్‌గా.. భక్తి ప్రపత్తులతో ప్రార్థన చేస్తారు. కానీ తిరుమలకు వచ్చే సరికి.. గర్భగుడిలో అయినా జై జగన్ నినాదాలిస్తారు. అపవిత్రం చేస్తారు. వీళ్లకా జంధ్యం కట్టుకున్న బ్రాహ్మణులు.. మూకుమ్మడిగా ఓట్లు వేసి.. ముఖ్యమంత్రిని చేయాల్సింది..!