హైదరాబాద్: మెగా స్టార్ వారసుడు, మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ్‌పై ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాంచరణ్‌ను సినిమాలలో తీసుకురావటం కోసం దవడను సర్జరీ చేసి సరిచేయించారని చెప్పారు. ఒక ఇంజనీరింగ్ కాలేజి ఫంక్షన్లో విద్యార్థులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
అభిలాష చిత్రానికి తాను పనిచేశానని, ఆ షూటింగ్ సమయంలోనే రాంచరణ్ పుట్టాడని తెలిపారు. చరణ్‌ను హీరోను చేయాలని అతని తల్లి సురేఖ చిన్నప్పుడే కరాటే, డాన్సులు నేర్పించారని చెప్పారు. రాంచరణ్‌కు దవడ సరిగా ఉండదని, దానిని ఆపరేషన్ చేయించి సెట్ చేయించారని తెలిపారు. మొత్తానికి మగధీర చిత్రంతో అతను సూపర్ హిట్ అయ్యాడని చెప్పారు. ఇదంతా చెప్పేటపుడు రాంచరణ్‌ను యండమూరి వాడు, వీడు అనే సంబోధించటం విశేషం. ఇంజనీరింగ్ విద్యార్థులనుకూడా యండమూరి అరేయ్, ఒరేయ్ అని సంబోధించారు. కొంతమంది విద్యార్థులను బూతులు కూడా తిట్టారు. చూస్తుంటే యండమూరికి ఏదో అయినట్లు అనిపిస్తోంది.
యండమూరి ఇంకా ఇలాకూడా అన్నారు. ప్రముఖ రచయిత సత్యమూర్తిని తాను సరస్వతి అని పిలిచేవాడినని యండమూరి చెప్పారు. చరణ్ పుట్టినపుడే రచయిత సత్యమూర్తికి కూడా కొడుకు పుట్టాడని చెప్పారు. ఆ పిల్లవాడిని సరస్వతీ ప్రసాద్ అని తాను పిలిచేవాడినని తెలిపారు. ఆ పిల్లవాడికి 8 ఏళ్ళ వయసునుంచే సంగీతం వాయిస్తూ ఉండేవాడని చెప్పారు. జగదేకవీరుడు-అతిలోక సుందరి చిత్రానికి తాము చెన్నైలో మ్యూజిక్ సిట్టింగ్స్‌లో ఉంటే ఈ పిల్లవాడు కూడా అక్కడకు వచ్చాడని తెలిపారు. ఇళయరాజా అబ్బ నీ తియ్యని దెబ్బ పాటకు ట్యూన్ చేస్తుంటే, ఈ పిల్లవాడు లేచి సార్, ఇది శివరంజని రాగం కదా అన్నాడని యండమూరి చెప్పారు. ఇళయరాజా ఆ పిల్లవాడి భుజం తట్టి, జీవితంలో ఎప్పటికైనా పైకి వస్తావని అన్నట్లు తెలిపారు. ఆ కుర్రవాడే పెద్దవాడై దేవీప్రసాద్గా మారి సంచలనం సృష్టిస్తున్నాడని చెప్పారు. తండ్రులను బట్టి కాదని, వారి వారి ఘనతలను బట్టే కొడుకులకు గౌరవం కలగాలని యండమూరి అన్నారు. పరోక్షంగా, దేవీప్రసాద్ తో పోలిస్తే చరణ్ వేస్ట్ అన్నట్లుగా ఉన్నాయి యండమూరి మాటలు.