జగన్ ఓటమి ఖాయమని తేలిపోయిందని అంచనాకు వచ్చిన భజన బ్యాచ్ లో కొంత మంది తమ పాత పరిచయాలను అడ్డం పెట్టుకుని బయటకు వచ్చి కూటమికి మద్దతు ప్రకటిస్తున్నారు. యార్లగడ్డ లక్ష్మిప్రసాద్ ఈ జాబితాలో చేరిపోయారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ కోసం ఆయన చేసిన రచ్చ… చంద్రబాబు స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియా పెడితే మాతృభాషను చంపేస్తున్నారని చొక్కా విప్పదీసి చేసిన నాటకాలు అందరికీ గుర్తుంటాయి. తర్వాత వైసీపీ ప్రభుత్వంలో అప్పనంగా డబ్బులు వచ్చే పదవి తీసుకుని రెస్ట్ తీసుకున్నారు.
హెల్త్ వర్శిటీకి ఎన్టీఆర్ పేరు తీసేసినప్పుడు తన కు ఇచ్చిన పదవికి రాజీనామా చేశారు కానీ… జగన్ రెడ్డిని మాత్రం పొగడటం ఆపలేదు. తెలుగు మీడియమే లేకుండా చేసినా జగన్ రెడ్డిని గొప్పగా పొగుడుతూ వచ్చారు. అయితే ఇప్పుడు ఎన్నికల ముంగిటకు వచ్చేసరికి సినిమా అర్థమయిందేమో కానీ.. వెంటనే ప్లేట్ ఫిరాయించేశారు. అయితే టీడీపీ నేతలు ఆయనను దగ్గరకు రానిచ్చేఅవకాశం లేదు. తనకు పరిచయమున్న నేతల్ని పట్టుకుని నేనొస్తా… మద్దతుగా మాట్లాడుతానని బతిమాలుకుని ఈ మేరకు ప్లేట్ ఫిరాయించినట్లుగా వైసీపీకి సంకేతాలు పంపారు.
కైకలూరుతో పాటు విజయవాడ వెస్ట్.. ఉండి వంటి చోట్ల యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ కూడా ప్రచారం చేస్తారట. ఈ విషయాన్ని ఆయన మీడియాకు సమాచారం ఇచ్చారు. ఆయనకు ప్రచారం చేసే అంత సీన్ ఉందా అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. కానీ గెలిచే కూటమిలో తానూ కూడా ఓ చేయి వేశానని చెప్పుకునేందుకు పనికి వస్తుందని ఆయన ఆశ. యార్లగడ్డ లాంటి వాళ్లు ఎందరో… !