వైసీపీ నుంచి టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్న యార్లగడ్డ వెంకట్రావు గుడివాడలో అయినా పోటికి సై అన్నారు. గుడివాడకు యార్లగడ్డ అనే మాట ఇప్పటి వరకూ వినిపించంలేదు. చంంద్రబాబుతో భేటీ తర్వాత అనూహ్యంగా గుడివాడలో అయినా పోటీకి సిద్దమని యార్లగడ్డ ప్రకటించారు. చంద్రబాబు ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తానని ప్రకటించారు. ఇప్పటికే గుడివాడలో ఇద్దరు నేతలు పని చేస్తున్నారు. ఒకరు రావి వెంకటేశ్వరరావు కాగా మరొకరు ఎన్నారై వెనిగండ్ల రాము.
చంద్రబాబు ఎలాంటి రాజకీయ సమీకరణాలు చూస్తారో కానీ.. యార్లగడ్డ పేరుల గన్నవరంతో పాటు గుడివాడకూ ప్రచారంలోకి వచ్చింది. అయితే యార్లగడ్డ పూర్తిగా గన్నవరంపైనే దృష్టి పెట్టారు. ఆయన వంశీతోనే ఇంత కాలం ఢీ అంటే ఢీ అన్నట్లుగా రాజకీయాలు చేస్తున్నారు. ఆయనపైనే విరుచుకుపడుతున్నారు. గన్నవరం టీడీపీకి ఆ స్థాయిలో కౌంటర్ ఇచ్చే నేత ఇప్పుడే లభించారు. వంశీ వైసీపీకి వెళ్లిన తర్వాత ఎవరో ఒకరిని తెచ్చి పెట్టాలని టీడీపీ కూడా అనుకోలేదు. కానీ చివరికి వంశీకి సరైన అభ్యర్థే దొరికాడన్న అభిప్రాయం వినిపిస్తోంది.
గన్నవరం టీడీపీ ఆఫీసు మీద దాడి చేయడమే కాదు .. టీడీపీ నేతలపైనే కేసులు పెట్టించడం వరకూ గన్నవరంలో చాలా జరిగాయి. ఇక చంద్రబాబు కుటుంబాన్ని ఘోరంగా అవమానించిన నేతల్లో వల్లభనేని వంశీ మొదటి వ్యక్తి . టీడీపీ హిట్ లిస్ట్ లో అతని పేరు ముందు ఉంటుందని టీడీపీ వర్గాలు చెబుతున్నారు. ఈ క్రమంలో యార్లగడ్డ మైండ్ గేమ్ లోభాగంగానే గుడివాడ ప్రస్తావన తీసుకు వచ్చారని… కానీ పోటీ మాత్రం గన్నవరంలోనే ఉంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.