రివ్యూ : యశోద

Yashoda Movie Review

తెలుగు360 రేటింగ్ 2.5/5

సమంత అగ్ర‌శ్రేణి క‌థానాయిక‌. దాదాపు స్టార్ హీరోలందరి సినిమాలు చేసింది. అయితే 2020 తర్వాత ఆమె కెరీర్ ఒక్కసారిగా నెమ్మదించింది. జాను తర్వాత మళ్ళీ సమంత నుంచి సినిమా రాలేదు. ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత లేడి ఓరియంటెడ్ మూవీ ‘యశోద’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సమంత కెరీర్ కి ఈ సినిమా చాలా కీలకం. యశోద ఫలితంపై ఖుషి, శాకుంతలం సినిమాలు కూడా ఆధారపడ్డాయి. యశోద విజయంతో తన మార్కెట్ మళ్ళీ పుంజుకుంటుందని ఆశలు పెట్టుకుంది సమంత. అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ సెలైన్ ఎక్కించుకొని మరీ యశోదకి డబ్బింగ్ చెప్పింది. తన వంతుగా ప్రమోషన్స్ లో పాల్గొంది. యశోద ట్రైలర్ సినిమా చూడాలనే ఆసక్తిని పెంచింది. సరోగసి నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్ అని ట్రైల‌ర్ చూస్తున్న‌ప్పుడే అర్ధమైయింది. ద‌ర్శ‌క నిర్మాత‌లూ ఇదే చెప్పారు. కాక‌పోతే… స‌రోగ‌సీని మించిన పాయింట్ ఈ సినిమాలో ఇంకోటి ఉంద‌న్న హింట్ అందుతూనే వ‌చ్చింది. మరింత‌కీ యశోద కథ ఏంటి ? సమంత గంపెడు ఆశలు పెట్టుకున్న ఈ చిత్రం ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇచ్చింది?

మధు(వరలక్ష్మీ శరత్ కుమార్) ఈవా పేరుతో సరోగసీ కేంద్రాన్ని నిర్వ‌హిస్తుంటుంది. యశోద (సమంత) ఓ పేదింటి అమ్మాయి. యశోద చెల్లికి అనారోగ్యం చేస్తుంది. చెల్లి వైద్యానికి డబ్బు కావాలి. మరో దారిలేక అద్దె గర్భానికి అంగీకరించి ఈవా సరోగసీని ఆశ్రయిస్తుంది. ఈవాలోకి వచ్చిన తర్వాత యశోదకి కొన్ని నమ్మశక్యం కాని నిజాలు తెలుస్తాయి. ఈవా కేంద్రం బయటప్రపంచానికి తెలియకుండా నడుపుతున్నారని అర్ధమౌతుంది. కొందరి నిస్సాయతని ఆసరాగా చేసుకొని అద్దె గర్భం పేరుతో ఓ చీకటి నేరానికి పాల్పడుతున్నారని తెలుసుకుంటుంది. మరి మధు చేస్తున్న చీకటి నేరం ఏమిటి ? మధు వెనుక ఎవరున్నారు? ఈవా కేంద్రంలోని అమ్మాయిలని యశోద ఎలా కాపాడింది ? అనేది మిగతా కథ.

క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్లు కామన్ గా అనుమానాస్పద మృతితో మొదలౌతాయి. యశోద కథని కూడా ఒక మిస్టరీ డెత్ తో మొదలుపెట్టారు దర్శకులు. ఫారిన్ హీరోయిన్ ఇండియా టూర్ కి వచ్చి అనుమానాస్పద స్థితిలో చనిపోతుంది. ఆమె శరీరంలో ఒక మిస్టీరియస్ డ్రగ్ లభ్యమౌతుంది. మరో పక్క యశోద ఈవా సరోగసి కేంద్రానికి చేరుతుంది. ఈ రెండికి మధ్య లింక్ వుందని ప్రేక్షకుడి అర్ధమౌతుంది. ఒక పక్క మిస్టీరియ‌స్ డెత్‌ విచారణ మరో పక్క సరోగసి కేంద్రంలో జరిగే కథ. రెండు కథలు సమాతంరంగా నడుస్తుంటాయి. ఈ రెండికి మధ్య కామన్ లింక్ వుందని తెలిసినప్పుడు కథనంను ఉత్కంఠభరితంగా నడపాలి. కానీ యశోద కథనం మాత్రం అంతగా రక్తికట్టదు. సరోగసి కేంద్రంలో నలుగురు అమ్మాయిలు తమ కష్టాలు చెప్పుకోవడం, అమ్మతనం గురించి మాట్లాడుకోవడం, లింగ వివక్ష గురించి చర్చించుకోవడం సాగదీత వ్యవహారంగా మారుతుంది.

విరామ ఘట్టం వరకూ అసలు కథ మొదలుపెట్టకపోవడం కూడా ఒక మైనస్. చెప్పడానికి కథ లేదా? అంటే చాలా వుంది. నిజానికి ఈవా కేంద్రంలో జరిగే క్రైమ్ షాకింగ్ గా వుంటుంది. ఆ కంటెంట్ తో పది ఎపిసోడ్ల వెబ్ సిరిస్ చేయచ్చు. అంత మంచి పాయింట్ ని పెట్టుకొని దాని హైలెట్ చేయకుండా టైమ్ పాస్ చేశారెందుకో అర్థం కాదు. క్రైమ్ థ్రిల్లర్స్ లో క్రైమ్ రివిల్ చేసిన విధానం ఆసక్తికరంగా వుండాలి. ఈవాలో జరుగుతున్న క్రైమ్ విష‌యంలో ఇన్ డైరెక్ట్ గా ఒక విచారణ జరుగుతుంటుంది. ప్రధాన పాత్రధారి యశోద లక్ష్యం కూడా క్రైమ్ ని రివిల్ చేయడమే. ఇన్ని పాత్రలు, సెటప్ ఉన్నప్పటికీ ఎవరైతే క్రైమ్ చేస్తున్నారో వారే ఆ క్రైమ్ ని వీడియో ప్రజంటేషన్ తో బయటపెట్టుకోవడం అంతగా ఆకట్టుకొదు.

ప్రధమార్ధంతో పోల్చుకుంటే ద్వితీయార్ధం రొటీన్ గా అనిపిస్తుంది. రెండు ఫ్లాష్ బ్యాకులు సెకండ్ హాఫ్ కే పరిమితం చేశారు. ఇందులో మధు ఫ్లాష్ బ్యాక్ మాత్రం షాకింగ్ గా వుంటుంది. కథలో కీలకమైన పాయింట్ అది. అయితే మధు తన గతం గురించి చెప్పుకున్న క్షణంలో ఈ కథ అయిపోయినట్లే. అయితే ఒక సుధీర్గ యాక్షన్ ఎపిసోడ్ పెట్టి క్లైమాక్స్ ని కూడా సాగదీసినట్లు అనిపిస్తుంది. నిజానికి సమాజంలో జరిగే అవకాశం వున్న క్రైమ్ ఇది. ఎండ్ కార్డ్ లో కొన్ని పేపర్ కంటింగులు కూడా వేశారు. దాన్ని ఇంకాస్త సోషలైజ్ చేసి తీస్తే బావుండేది. అప్పుడు మ‌రింత‌ మంది కన్తెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఈవా అనే ఓ కేంద్రాన్ని సృస్టించి స్విడ్ గేమ్ తరహాలో చీకటి వ్యవహారంలా ట్రీట్ చేయడాకే మొగ్గు చూపాడు దర్శకుడు.

యశోద సమంత వన్ విమన్ షో అని చెప్పాలి. నటిగా సమంత ఎప్పుడో పరిణితి సాధించింది. తన అనుభవంతో యశోద పాత్రలో ఒదిగిపోయింది. పాత్రలో భిన్న పార్శ్వాలని చక్కగా ప్రదర్శించింది.
యాక్షన్ సన్నివేశాలలో సరికొత్త సమంత కనిపిస్తుంది. వరలక్షి శరత్ కుమార్ కీ కీలక పాత్ర దక్కింది. గ్రే షేడ్స్ ఉన్న పాత్రలో తనదైన శైలిలో నటించింది. ఉన్ని ముకుందన్ పాత్ర కూడా కీలకమే . రావు రమేష్ పాత్ర ఎప్పటిలానే ఆకట్టుకున్నారు. అయితే ఆ పాత్రని పెద్దగా వాడుకోలేదనిపిస్తుంది. మురళి శర్మతో పాటు మిగతా పాత్రలు పరిధిమేర వున్నాయి.

నిర్మాణ పరంగా సినిమా రిచ్ గా వుంది. ‘ఈవా’ సరోగసి సెంటర్ ని చాలా లావిష్ గా డిజైన్ చేశారు. యాక్షన్ సీక్వెన్స్ లు స్టయిలీష్ గా షూట్ చేశారు. సుకుమార్ కెమెరాపని తనం డీసెంట్ గా వుంది. మణిశర్మ నేపధ్య సంగీతం ఆకట్టుకుంది. చాలా చోట్ల థ్రిల్లింగ్ మూడ్ ని ఎలివేట్ చేసింది. అయితే త‌న ట్యూన్ల‌కు ప‌ని ప‌డ‌లేదు. ఈ సినిమాలో పాట‌లు కూడా అన‌వస‌ర‌మే. పాట‌ల్ని ప‌క్క‌న పెట్టి చిత్ర‌బృందం మంచి ప‌ని చేసింది. శ్రీదేవి మూవీస్ నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా వున్నాయి. పుల‌గం, చ‌ల్లా భాగ్య‌ల‌క్ష్మి.. ఈ క‌థ‌కు ఏం కావాలో అలాంటి మాటలే రాశారు. `రాజు కావాలంటే యుద్ధం చేయాలి. రాణీ కావాలంటే రాజుని గెలిస్తే స‌రిపోతుంది` లాంటి మంచి సంభాష‌ణ‌లు అక్క‌డ‌క్క‌డ వినిపించాయి. ఒక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ కి కావాల్సిన అన్ని అంశాలు యశోదలో వున్నాయి. దర్శకులు ఎంచుకున్న పాయింట్ విలక్షణమైనదే. అయితే ఆ అంశాలని, పాయింట్ ని తెరపై రక్తికట్టించడంలో మాత్రం యావరేజ్ మార్కుల దగ్గరే ఆగిపోయింది యశోద.

తెలుగు360 రేటింగ్ 2.5/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close