‘రాజధాని ఫైల్స్’ ఎక్కడి నుంచి వచ్చిందో, సడన్‌గా వైరల్ అయిపోయింది. స్టార్లు లేరు. మేకింగ్ విషయంలో గొప్పగా లేదు. కానీ… విషయం ఉంది. జగన్ మోహన్ రెడ్డి ఏపీ ప్రజలకు, ముఖ్యంగా రైతులకు చేసిన ద్రోహం ఉంది. అందుకే ‘యాత్ర 2’కి ఎంత ప్రమోషన్ చేసినా రాని స్పందన… `రాజధాని ఫైల్స్`కి ఏం చేయకుండానే వచ్చేసింది. అతి తక్కువ సమయంలో 5 మిలియన్ వ్యూస్‌ని సంపాదించుకొందంటే – ఎంతగా వైరల్ అయ్యిందో అర్థం చేసుకోవొచ్చు. బాబాయ్ గొడ్డలి షాట్, జగన్ పబ్ జీ ఆడుకోవడం, అసెంబ్లీలో ఓ మంత్రి బూతులు మాట్లాడడం.. ఇలా ప్రతీదీ వైలర్ అయ్యింది. వీటిపై బోలెడన్ని మీమ్స్ బయల్దేరాయి.
మరోవైపు ‘యాత్ర 2’ పరిస్థితి రివర్స్ గేర్ లో ఉంది. ‘యాత్ర’ టైమ్‌లో ఉన్న బజ్ ‘యాత్ర 2’కి లేదు. ఆ ప్రభుత్వం అధికారంలో ఉంది. భారీగా ఖర్చు పెట్టి పబ్లిసిటీ చేసుకోగలరు. అయినా సరే.. ఎవరూ ఈ సినిమా గురించి మాట్లాడుకోవడం లేదు. రేపు ‘యాత్ర 2’ విడుదల అవుతోంది. బుక్ మై షోలో టికెట్లు అందుబాటులో ఉన్నాయి. కానీ జనాల నుంచి స్పందనే లేదు. అదేదో మసి పూసి మారేడుకాయ చేసే సినిమా అని ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతోంది. అందుకే సాధారణ ప్రేక్షకులు లైట్ తీసుకొన్నారు. థియేటర్ల దగ్గర జనం లేకపోతే ఎలా? అందుకే టికెట్లు పంచి పెట్టే బాధ్యత వాలెంటీర్లు తీసుకొన్నారు. ‘మా దగ్గర టికెట్లు ఉన్నాయ్. కావాల్సిన వాళ్లు దయచేసి సంప్రదించండి’ అంటూ ఫేస్ బుక్‌లలోనూ, ట్విట్టర్లలోనూ పోస్టులు పెడుతున్నారు. అయినా స్పందన వస్తుందన్న గ్యారెంటీ లేదు. చివరికి టికెట్లను కూడా వాలెంటీర్లతో పంచాల్సిన పరిస్థితి వచ్చింది.