చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు… ఐఎంజీ భరత అనే సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అది ఇరవై ఏళ్ల కిందటి ముచ్చట. ఆ ఒప్పందం చేసుకున్న తర్వాత చంద్రబాబు ఓడిపోయారు. భూములను సొంత ఆస్తులుగా క్విడ్ ప్రో కో చేయడంలో రాటుదేలిపోయిన వైఎస్ఆర్ అండ్ సన్ .. పరిపాలనలో… ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. చాలా విచారణలు చేశారు. కానీ వారికి అందులో స్కామ్ ఎక్కడా కనిపించలేదు. కానీ ఒప్పందాన్ని మాత్రం రద్దు చేసుకున్నారు. ఇలా రద్దు చేసుకోవడం కరెక్ట్ కాదని ఆ సంస్థ కోర్టుకెళితే.. రీసెంట్ గా తెలంగాణ హైకోర్టు వారి పిటిషన్ కొట్టేసింది. భూములు ప్రభుత్వానివేనని చెప్పింది.
ఇది చంద్రబాబు హయంలో జరిగింది కాబట్టి ఆయనే స్కాం చేశాడని ఆరోపణలు ప్రారంభించారు. అసలు ఇందులో స్కాం ఏమిటో మాత్రం చెప్పడం లేదు. క్రీడారంగం.. క్రీడాకారుల శిక్షణ కోసం .. ఐఎంజీ భరతకు కేటాయించారు. అది ఇప్పటి ప్రభుత్వాలు ఇస్తున్నట్లుగా సేల్ డీడ్ కాదు. కేవలం ఉపయోగించుకోవడానికే. అమ్మడానికి కాదు. అయితే రాజకీయాల కోసం ప్రపంచ స్థాయి క్రీడా సౌకర్యాల ప్రాజెక్టును వదిలేసుకోవడమే కాకుండా… అదో స్కాం అంటూ తప్పుడు ప్రచారాలు చేస్తూనే పోతున్నారు.
వైఎస్ అనేక విచారణలు వేశాడు..సీబీఐ కూడా దర్యాప్తు చేసింది. ఏమీ లేదని తేల్చారు. కానీ ఇప్పుడు ఆ భూములు ప్రభుత్వానివేనని కోర్టు తీర్పు చెప్పిందని మరోసారి బురద బకెట్లు రెడీ చేసుకుని పులిమేస్తున్నారు. విషయమేమిటంటే… బీఆర్ఎస్ సోషల్ మీడియా కూడా అదే పని చేస్తోంది. ఆ ఒప్పందంలో స్కాం ఉంటే…పదేళ్లు ఏం చేశారన్న ప్రశ్నకు వారి దగ్గర సమాధానం ఉండటం లేదు. ప్రజల్ని నిలువు దోపిడీ చేసిన వైసీపీ నేతలు … తమకు అలవైటన రీతిలో పెద్ద స్కాం అంటూ.. రెచ్చిపోతున్నారు. రాజకీయం అంటే ఇదేనేమో ?