వైసీపీ, టీఆర్ఎస్ విభజన రాజకీయాలు మొదలు పెట్టాయి. పోలవరం విషయంలో పువ్వాడ అజయ్ అలా వ్యాఖ్యలు చేయగానే… ఇలా వైసీపీ మంత్రులు బిలబిలమంటూ బయటకువచ్చేశారు. పోటాపోటీగా సెంటిమెంట్ ప్రకటనలు ప్రారంభించారు. పోలవరం వల్లే భద్రాచలానికి ముప్పు ఏర్పడిందని … ముంపు గ్రామాలను ఏపీలో కలపాలని ఆయన డిమాండ్ చేశారు. వెంటనే బొత్స సత్యనారాయణ గంట కూడా ఆలస్యం చేయకుండా తెర మీదకు వచ్చేశారు. అజయ్‌పై మండిపడ్డారు. ఆయన గ్రామాలను విలీనం చేయమంటే.. తాము మళ్లీ రెండు రాష్ట్రాలను విలీనం చేయాలని డిమాండ్ చేస్తామని ప్రకటించేశారు.
ఈ పొలిటికల్ ఇష్యూలో కంటిన్యూటీ మిస్ కాకుండా కాసేపటికి అంబటి రాంబాబు హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ పెట్టారు. అదే వాదన వినిపించారు. తాము సమైక్య రాష్ట్రం కోరతామన్నారు. రెండు వైపుల నుంచి ఇలాంటి వాదనలు ఇంకా కొనసాగే అవకాశం ఉంది. అయితే ఈ ఓవర్ స్పందనల రాజకీయాలను సామాన్య జనం ఆశ్చర్యంగా చూస్తున్నారు. మరీ ఇంతగా రియాక్టవుతున్నారేంటి.. ఇదేమైనా కొత్తగా అని విస్తుపోతున్నారు. ఇలాంటి రాజకీయాలు చాలా సార్లు జరిగాయి కదా.. మళ్లీ ఇప్పుడెందుకు ప్రయత్నిస్తున్నారు జనంకు బోర్ కొట్టేసింది కదా అని మరికొంత మంది ప్రశ్నిస్తున్నారు .
రాజకీయంగా ఆప్తమిత్రులైన వైసీపీ, టీఆర్ఎస్ కూడబలుక్కుని ఈ రాజకీయం చేస్తున్నాయని సులువుగానే ఆర్థం చేసుకోవచ్చు. గతంలో పోలవరం ఎత్తు తగ్గించేందుకు జగన్ అంగీకరించాలని అసెంబ్లీలోనే సీఎం జగన్ ప్రకటించారు. అయినా వైసీపీ నేతలు కిక్కురుమనలేదు. కానీ ఇప్పుడు మాత్రం రక్తి కట్టించేందుకు రెడీ అయిపోయారు. అయితే ఇది మీర పాత అంశమని..కొత్తటాపిక్ ఎంచుకోవాలన్న సెటైర్లు రెండు పార్టీలపై పడుతున్నాయి.