తిరుపతిలో జరిగిన ఓ దుర్ఘటన వేదికగా వైసీపీ రెచ్చిపోతోంది. వరుసగా ఒకరి తర్వాత ఒకరు రోజా, అంబటి, వైవీ సుబ్బారెడ్డి లాంటి ఉద్దండులు మీడియా ముందుకు వచ్చి రెచ్చిపోతున్నారు. రాజీనామాలు చేయాలని సవాల్ చేస్తున్నారు. తమ హయాంలో తిరుమలలో భ క్తుల్ని దోచుకుని దర్శన టిక్కెట్లతో లక్షలు సంపాదించుకున్న రోజా.. ఇప్పుడు ఆ ఆటను టీటీడీ జేఈవో వెంకయ్య చౌదరి సాగనీయడం లేదు. దాంతో ఆమె.. వెంకయ్యచౌదరిని టార్గెట్ చేశారు. ఆయనను తప్పించాలని డిమాండ్ చేశారు. అసలు జరిగిన ఘటన ఏంటి.. టీటీడీ జేఈవోను తొలగించాలని డిమాండ్ చేయడం ఏమిటి ?
అంబటి రాంబాబు, వైవీ సుబ్బారెడ్డి వంటి వారు కూడా మీడియా ముందుకు వచ్చి తమ శవరాజకీయ ప్రదర్శన చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే జరిగిందని ఆరోపణలు చేస్తున్నారు. అక్కడేం జరిగిందో చెప్పడానికి ఎవరూ ఇష్టపడటం లేదు. కానీ కూటమి ప్రభుత్వమే ఈ తొక్కిసలాటకు కారణం అని.. వెంటనే రాజీనామాలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వైసీపీలో ఎప్పుడూ కనిపించనంత ఉత్సాహం కనిపిస్తోంది. పార్టీ ఆఫీసులో రోజాకు ఇటీవలి కాలంలో ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఇవ్వలేదు. శ్యామలకూ చాన్సిచ్చారు కానీ రోజాకు ఇవ్వలేదు. కానీ ఈ విషయంలో మాత్రం రోజాకు అవకాశం ఇచ్చారు.
శవరాజకీయాలు చేయడంలో వైసీపీకి ప్రత్యేకమైన బ్రాండ్ ఉంది. తిరుమలలో తాము చేసిన తప్పిదాలన్ని ఒకటొకటిగా బయటపడుతూండటంతో.. వాటిని కప్పి పుచ్చుకునేందుకు ఈ తొక్కిసలాట ఘటనను ఉపయోగించుకుని తెరమీదకు వచ్చి ప్రభు్త్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.