ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులే అయినందున… ప్రభుత్వంపై విమర్శలు చేయకూడదన్నట్లుగా మాట్లాడుతున్నారు చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి. విత్తనకొరత. కరెంట్ కోతలపై.. విపక్షం నుంచి వస్తున్న విమర్శల దాడిని తిప్పికొట్టేందుకు … శ్రీకాంత్ రెడ్డి వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. అసలు సమస్యలే లేవని తేల్చి చెప్పేశారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేవు..విత్తనాల కొరత లేదని.. నెలరోజుల్లోనే ప్రభుత్వంపై చంద్రబాబు, లోకేష్ ఆరోపణలు సరికాదని చెప్పుకొచ్చారు. మరి కొద్ది రోజలుగా.. వైసీపీ తరపున రికార్డెడ్‌గా మాట్లాడిన నేతలంతా…విత్తన సంక్షోభానికి చంద్రబాబే కారణమని ఆరోపణలు చేశారు.
చివరికి వ్యవసాయమంత్రి కన్నబాబు కూడా.. ఓ కట్ట లేఖలు మీడియా ముందు పెట్టి.. చంద్రబాబు విత్తన కంపెనీలకు నిధులివ్వకపోవడం వల్లే.. విత్తన కొరత ఏర్పడిందని ఆరోపించారు. దీనికి చంద్రబాబే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక .. రోజూ ఏదో ఓ చోట.. రైతులు విత్తనాల కోసం.. ఆందోళనలు చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అలాగే.. కరెంట్ కోతల గురించి… కూడా.. ఆందోళనలు జరుగుతున్నయి. సబ్ స్టేషన్లను ముట్టడిస్తున్నారు. అయినప్పటికీ.. శ్రీకాంత్ రెడ్డి.. అసలు ఏపీలో కరెంట్ కోత లేదని తేల్చారు. అంతే కాదు.. విత్తనాల కొరత కూడా లేదన్నారు.
అసెంబ్లీలో..కరెంట్ కోతలపై.. అచ్చెన్నాయుడు కూడా మాట్లాడారు. కరెంట్ ఉంది.. సరిగ్గా మెయిన్టనెన్స్ లేకపోవడం వల్లే కరెంట్ ఇవ్వకపోతున్నారని అసెంబ్లీలో చెప్పారు. అప్పుడు ప్రభుత్వం కరెంట్ కోతల్లేవని చెప్పలేకపోయారు. ఇప్పుడు సమస్య తీవ్రతరం అయ్యే సరికి.. ప్రతిపక్షం నుంచి విమర్శలు ప్రారంభమయ్యే సరికి.. అసలు సమస్యే లేదని చెప్పుకునేందుకు ప్రాధాన్యం ఇస్తోంది.