వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రతీరోజూ సీబీఐ గత ఏడాది తీసుకున్న సాక్షుల వాంగ్మూలాలు బయటకు వస్తున్నాయి. అవన్నీ అన్నిమీడియాల్లో హైలెట్ అవుతూంటే వైసీపీకి మద్దతున్న మీడియాలో మాత్రం వివేకా కుమార్తె సునీతపై నిందలేస్తూ నిందితులు.. అనుమానితులు మాట్లాడుతున్న మాటలు.. వీడియోలు.. అఫిడవిట్లను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. దీంతో వాటిని చూస్తున్న వారికి నిందితులకు శిక్షపడాలని పోరాడుతున్న సునీతను నిందితురాలిగా చేయడానికి ప్రణాళికలు వేయడం సామాన్యుల్ని కూడా ఆశ్చర్యపరుస్తోంది.
ఈ విషయంలో వైసీపీ తప్పు చేసిందన్న భావన అందరిలోనూ కలుగుతోంది. ఈ విషయంలో కనీసం సైలెంట్‌గా ఉన్నా ఇమేజ్ కాపాడుకునేవారేమోకానీ ఇప్పుడు దారుణంగా వైఎస్ కుమార్తె పైన..చనిపోయిన వైఎస్ వివేకాపైన నిందలేయడానికి కూడా సిద్దపడటంతో .. వైసీపీ పైనా.. ఆ పార్టీ నేతలపైనా ప్రజల్లో ఎన్నో రకాల సందేహాలు.. అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వైసీపీ నేతలు ఇదేమీ పట్టించుకోవడం లేదు తమ పద్దతిలో తాము అవినాష్ రెడ్డిని డిఫెండ్ చేస్తూ సునీతపై నిందలేస్తున్నారు. అంతిమంగా ప్రజల్లో ఎంత బ్యాడ్ ఇమేజ్ తెస్తుందనే సంగతిని వైసీపీ నేతలు లైట్ తీసుకున్నారు.
వైఎస్ సునీత మాత్రం ప్రణాళికా బద్దంగా తాను చేయాలనుకున్నది చేస్తున్నారు. తనపై నిందలేస్తున్నారని ఆమె ఆవేశపడటం లేదు. నిందితులకు శిక్ష పడాలన్న లక్ష్యంతో ఆమెపని చేస్తున్నారు.ఈ కారణంగా ప్రజల్లోనూ ఆమెకు సానుభూతి పెరుగుతోంది.