గంటా ఒక్క సారి నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుంటే.. అక్కడ రాజకీయాన్ని తనదైన శైలిలో మార్చేసుకుంటారు. ఇప్పుడు భీమిలీలో ఆయన అవంతి శ్రీనివాస్ తో ఓ ఆట ఆడుకుంటున్నారు. గతంలో ఓ సారి గెలిచిన నియోజకవర్గమే కాదు ఇప్పటికీ బలమైన అనుచర వర్గం ఉన్న నియోజకవర్గం భీమిలి. స్థానిక ఎన్నికల్లో ఎన్ని కుట్రలు చేసినా వైసీపీని పూర్తి స్థాయిలో గెలిపించలేకపోయిన అవంతి శ్రీనివాస్.. గంటా ముందు తేలిపోతున్నారు.
వైసీపీ క్యాడర్ ను గంటా శ్రీనివాస్ రోజుకు రెండు షిప్టుల్లో పార్టీలో చేర్చుకుంటున్నారు. వీరిలో స్థానిక సంస్థల ప్రతినిధులు ఉంటున్నారు. పంచాయతీల్లో సర్పంచ్లు వార్డు మెంబర్లు సహా అందరూ చేరిపోతున్నారు. అవంతి శ్రీనివాస్ వారిని ఆపలేకపోతున్నారు. గంటా ఇంటి దగ్గర క్యాంప్ పెట్టుకుని అక్కడకు వస్తున్న వారిని గుర్తించి.. ప్లీజ్. ప్లీజ్ టీడీపీలోకి పోవద్దని బతిమాలుతున్నారు. కానీ ఒక్కరికీ మనసు కరగడం లేదు. అందరూ పోలోమంటూ టీడీపీలో చేరిపోతున్నారు.
అవంతి శ్రీనివాస్ పై సహజంగానే నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆయనకు టిక్కెట్ నిరాకరిస్తారని అనుకున్నారు. కానీ గట్టి అభ్యర్థి దొరకలేదేమో కానీ ఆయననే కొనసాగించారు. అందుకే భీమిలి కంటే మంచి నియోజకవర్గం ఉండదనుకున్న గంటా.. పట్టుబట్టి దాన్నే కేటాయింప చేసుకున్నారు. ఇప్పుడు తనదైన మార్క్ రాజకీయాలతో దడ పుట్టిస్తున్నారు.