జగన్ మోహన్ రెడ్డి చూసి చదివితే ఓ బాధ.. సొంతంగా మాట్లాడితే మరో బాధ. ఆయన ఎంత సీరియస్ గా మాట్లాడినా అదంతా పెద్ద కామెడీ అయిపోతుంది. ఓడిపోయిన తర్వాత కూడా అందులో పెద్దగా తేడా ఏం రాలేదు. తగుదునమ్మా అంటూ పిన్నెల్లిని పరామర్శించడానికి వచ్చి.. రాసిచ్చింది చదవక సొంత కవిత్వం ఏదో చెప్పాలని ప్రయత్నించడంతో అది కాస్తా కపిత్వంగా మారిపోయింది. సోషల్ మీడియా అంతా ముఖం మీద నవ్వేసింది.
ఈవీఎంలను ధ్వంసం చేయడాన్ని ఇంత నిస్సిగ్గుగా ఎలా సమర్థించుకుంటారని సామాన్య జనం కూడా ఆశ్చర్యపోతున్నారు. ఆయనకు ఓట్లు పడకపోతే ధ్వంసం చేస్తారా .. అది లీగలా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి.. చట్టాల మీద, వ్యవస్థల మీద కనీస గౌరవం లేకపోవడం ఎవరికైనా ఆశ్చర్యమే . జగన్ ను చూస్తే ఇప్పుడు అందరికీ అదే అభిప్రాయం కలుగుతుంది. ఐదేళ్ల పరిపాలన ఎలా జరిగిందో జగన్ మాటల వల్ల చాలా మందికి క్లారిటీ వస్తోంది.
ఆయనపై ఈసీకి ఫిర్యాదు చేయాలని టీడీపీ డిసైడయింది. ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉంటూ, మాజీ ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి ఈవీఎం ధ్వంసం చేయడానికి సమర్థించేలా జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన వీడియో క్లిప్పింగ్‌తో సహా ఫిర్యాదు చేయనున్నారు. ఎన్నికల సంఘ పనితీరును కించపరిచేలా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జగన్ మాట్లాడిన మాటలతో ఇలా ఎలా అని వైసీపీ క్యాడర్ కూడా గింజుకుంటోంది. పార్టీ భవిష్యత్ పై మరింత దిగులు చెందుతున్నారు.