చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు ఇచ్చిందంటూ హిందూస్థాన్ టైమ్స్ పత్రిక రాసుకొచ్చిన ఆర్టికల్ వైసీపీ కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్లుగా చెలరేగిపోతోంది. రూ. 118 కోట్ల విషయంలో ఈ నోటీసులు జారీ అయ్యాయని .. వివిధ సంస్థల నుంచి అవి చంద్రబాబుకు చేరాయని ఐటీ శాఖ చెబుతోందని అది.. వెల్లడించని ఆదాయంగా ఎందుకు చెప్పకూడదో వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల సారాంశమని హిందూస్థాన్ టైమ్స్ చెప్పుకొచ్చింది. ఈ నోటీసులు వచ్చింది కూడా ఆగస్టు నాలుగోతేదీని రాసుకొచ్చింది. ఈ నోటీసుల్లో నిజం ఎంతో కానీ.. ఇలాంటివి ప్లాంట్ మరీ ప్రచారం చేయడంలో ఆరితేరిపోయిన వైసీపీ.. హిందూస్థాన్ టైమ్స్ రాసిన ఆర్టికల్ ను ఫ్రేమ్ కట్టించుకుని మరీ రంగంలోకి దిగిపోయింది.
గత ప్రభుత్వం హయాంలో ఏ అవినీతిని కనిపెట్టలేకపోయిన వైసీపీ.. తమకు ఉన్న అన్ని సోర్సుల ద్వారా..2019లో జరిగిన ఐటీ సోదాల విషయంలో ఏమైనా ఉన్నాయా అని ఐటీ అధికారుల నుంచి సమాచారం కోసం చాలా కాలంగా ప్రయత్నిస్తోందని మీడియాలో వార్తలొచ్చాయి. స్వయంగా సీఐడీ కూడా చాలా సార్లు లేఖలు రాసింది. కానీ ఏమీ దొకరలేదేమో కానీ.. ఈ నోటీసులు పేరుతో హిందూస్థాన్ టైమ్స్ లో వచ్చిన వార్తను అడ్డం పెట్టుకుని కొత్త కథలు వండటం ప్రారంభించారు. ఇప్పుడు హిందూస్థాన్ టైమ్స్ లో నోటీసుల పేరుతో చెప్పిన అడ్డగోలు విషయాలన్నీ.. గతంలో అసెంబ్లీలో సందర్భం లేకపోయినా జగన్ రెడ్డి చెప్పినవే.
దానికి ఎలాంటి ఆధారాలు లేవని కూడా ఆయనే చెప్పుకున్నారు. ఊరుకనే చెబుతున్నానని అసెంబ్లీలో అడ్డగోలుగా మాట్లాడారు. ఇప్పుడు మరోసారి పత్రికలో వచ్చిన వార్తతో అదే తరహా ప్రచారం ప్రారంభించారు. నిజానికి ఐటీ శాఖ నోటీసులు ఇస్తే.. చంద్రబాబు తరపున వివరణ కూడా ఇచ్చారని.. అయితే వాటిని తిరస్కరించారని చెబుతున్నారు. తెర వెనుక ఏం జరుగుతుందో కానీ.. వైసీపీకి మాత్రం కొబ్బరి చిప్ప దొరికినట్లు అయింది.