హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సవాల్ విసిరింది. పట్టిసీమ ప్రాజెక్ట్ ద్వారా ఆగస్ట్ 15వ తేదీలోగా గోదావరినుంచి కృష్ణానదికి ఒక్క లీటర్ నీటిని తరలించినా తమ పార్టీ తరపున ముఖ్యమంత్రికి సన్మానం చేస్తామని వైసీపీ నాయకుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ సవాల్ విసిరారు. చంద్రబాబు ఇటీవల పట్టిసీమ ప్రాజెక్ట్ పనులను పర్యవేక్షించి ఆగస్టు 15నాటికి పూర్తవుతుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పట్టిసీమ ప్రాజెక్టు పనులపై ఇవాళ రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన పిల్లి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎత్తిపోతలతో నదులను అనుసంధానం చేస్తామంటూ సీఎమ్ చంద్రబాబు, ఇరిగేషన్ మంత్రి దేవినేని రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు.
మరోవైపు వైసీపీ మరో నాయకుడు బొత్స సత్యనారాయణ గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో ప్రజావ్యతిరేక పాలన సాగుతోందని అన్నారు. కార్యకర్తలు దోచుకుని దాచుకోవటానికన్నట్లుగా ప్రభుత్వ పాలన ఉందని ఆరోపించారు.