ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్న అంశంపై వైసీపీ అసహ్యం పుట్టేలా రాజకీయం చేస్తోంది. గుర్రంపాటి దేవేందర్ రెడ్డి అనే వ్యక్తిని మొదట రంగంలోకి దింపి.. ఆ తర్వాత విజయసాయిరెడ్డి వచ్చారు. తర్వాత లక్ష్మిపార్వతితో ప్రెస్ మీట్ పెట్టించి ఎన్టీఆర్ కుటుంబంపై ఎన్ని నిందలు వేయాలో అన్నీ వేయించారు. రేపోమాపో జగన్ రెడ్డి కూడా అలాంటి వ్యాఖ్యలు చేసినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే… వివేకా హత్య కేసుకు కౌంటర్‌గా .. .. ఉమామహేశ్వరి ఆత్మహత్య కేసును వైసీపీ తెర ముందుకు తెస్తుంది. వివేకా హత్య కేసు అంశాన్ని ప్రశ్నిస్తున్నారు కాబట్టి.. తాము ఎన్టీఆర్ కుమార్తె ఆత్మహత్య కేసును ప్రశ్నిస్తామన్నట్లుగా వైసీపీ నేతల తీరు ఉంది.
ఉమామహేశ్వరి ఆత్మహత్య కేసులో ఎలాంటి అనుమానాలు ఉన్నా… పోలీసులు చర్యలు తీసుకోకుండా ఉండరు. ఎందుకంటే అక్కడ టీఆర్ఎస్ అధికారంలో ఉంది. టీఆర్ఎస్ అండగా. .అక్కడి పోలీసుల్ని ఉపయోగించుకుని వైసీపీ నేతలు ఎన్ని రాజకీయాలు చేశారో కళ్ల ముందే ఉంది. ఇక్కడ ఎలాంటి అనుమానాస్పద అంశాలు లేకపోయినా.. వివేకా హత్య కేసులాగా తమకు తాము ప్రచారం చేసుకోవడం రాజకీయం అనుకుంటున్నారు. వైసీపీ సపోర్టర్లు కూడా చాలా మంది ఈ అంశంపై స్పందించలేకపోతున్నారు. ఇది దారుణమైన రాజకీయం అని మౌనంగా ఉంటున్నారు.
క్షుద్రమైన రాజకీయం చేసి.. కుటుంబాలను వివాదం చేయడం కరెక్ట్ కాదనుకుంటున్నారు. గుర్రంరెడ్డి, విజయసాయిరెడ్డి వంటి వారు చేసిన వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో వస్తున్న స్పందన అలాగే ఉంది. వివేకా హత్య కేసులో … స్పష్టంగా హత్య అని తెలిసినా గుండెపోటు అని ప్రచారం చేసి దొరికిపోయారు కాబట్టే… ఇంత రచ్చ అయింది. తర్వాత నిందితుల్ని కాపాడేందుకు ప్రయత్నిస్తూ.. అసలు హత్య ఎవరు చేశారో అనుమానాలు కలిగిస్తున్నారు. దీన్ని టీడీపీ గట్టిగా ప్రశ్నిస్తోంది. ఇలాంటి సమయంలో చంద్రబాబును టార్గెట్ చేయడం కోసం.. దారుణమైన రాజకీయం చేయడంపై ఏపీ ప్రజల్లోనూ విస్తృత చర్చ జరుగుతోంది. వైసీపీ నేతల మానసిక స్థితిపై అనుమానాలు ప్రారంభమయ్యేలా చేస్తోంది.