చంద్రబాబునాయుడు నిరుద్యోగ యువత కోసం నిరుద్యోగ భృతి పథకం పెట్టి.. భృతి ఇచ్చి.. ఇలా భృతి తీసుకునేవాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి ఎప్పటికప్పుడు ఉద్యోగాలిచ్చేలా వ్యవస్థను సృష్టిస్తే.. జగన్ ెడ్డి ఏపీకి కోటిన్నర మంది నిరుద్యోగులు ఉన్నారని వారిలో పది శాతం మందికేనా ఇచ్చేది అని ప్రచారం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో రెండున్నర లక్షలకుపైగా ఖాళీగా ఉన్నాయని తాను రాగానే ప్రతీ ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాల భర్తీ చేస్తామన్నారు. చంద్రబాబు హయాంలో మూడు డీఎస్సీలు వేస్తే కొద్ది పోస్టులే భర్తీ చేస్తున్నారని.. తాను రాగానే మెగా డీఎస్సీ అన్నారు. యువతను ఇలా రెచ్చగొట్టి ఓట్లు వేయించుకున్నారు జగన్ రెడ్డి. ఐదేళ్లలో ఏమయింది.. నమ్మిన యువత జీవితాల్ని సర్వ నాశనం చేశారు.
ఐదేళ్లలో ఒక్క సారి కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. చంద్రబాబు హయాంలో జరగిన గ్రూప్ టు పోస్టులను అధికారంలోకి రాగానే అడ్డోగలు వాల్యూయేషన్ లు చేసి పోస్టులు అమ్ముకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. జాబ్ క్యాలెండర్ ఊసే లేదు.. ఉద్యోగాల భర్తీ ఊసే లేదు. టీచర్ల పోస్టుల భర్తీ విషయంలో జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాన్ని తల్చుకుంటే యువత గుండెలు రగిలిపోతున్నాయి. చంద్రబాబు హయంలో వేసిన డీఎస్సీలు కూడా వేయలేదు. ఎన్నికలకు ముందు ఆరు వేల పోస్టులతో డీఎస్సీలు వేసి.. తప్పుడు రూల్స్ పెట్టి కోర్టుల్లో ఆగిపోయేలా చేశారు. కానీ లక్షల మంది నిరుద్యోగుల నుంచి పరీక్ష ఫీజులు మాత్రం వసూలు చేశారు.
వాలంటీర్ వ్యవస్థను తీసుకు వచ్చి… యువ శక్తిని నిర్వీర్యం చేశారు. పైగా గొప్పగా తన మీడియాలో విప్రోలో ఉద్యోగం వచ్చింది.. వాలంటీర్ పోస్టు కోసం వదిలేశాను. నా పిల్లలు ఇంజినీరింగ్, పీజీలు చదివారు వాలంటీర్లుగా పని చేస్తున్నారని.. అదేదో గొప్ప ఉద్యోగం అన్నట్లుగా మోటివేట్ చేసి యువతను నాశనం చేయడానికి.. తన రాజకీయ అవసరాలు తీర్చుకోవడానికి వాడుకున్నారు. ఇక పంచాయతీలు ఉండగా.. రాజ్యాంగ వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థ చట్ట వ్యతిరేకం అన్నదానిపై కోర్టుల్లో కేసులున్నాయి. అవి చట్ట వ్యతిరేకం అని తేలితే.. వారి ఉద్యోగాలు కూడా పోతాయి. అసలు ఆ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలేనా అన్న అనుమానం వచ్చేలా సర్వీస్ రూల్స్ పెట్టారు.
పాలనపై అవగాహన లేని.. సొంత ఆదాయం.. రాష్ట్రమంటే సొంతానికి వాడుకునేందుకు రాసిచ్చారనుకునే పాలకుడి వల్ల యువత భవిష్యత్ ఐదేళ్లు నిర్వీర్యం అయిపోయింది. ఎంతో మంది తమ కలలను సాకారం చేసుకోలేకపోయారు. అయినా ఇప్పుడు అందరికీ తలా ఐదువేలు ఇచ్చాను.. ఓటేస్తే మరో ఐదువేలు ఇస్తాను అంటూ.. వస్తున్నారు. భవిష్యత్ ను పది వేలకు యువత నాశనం చేసుకుంటారా ?