గతంలో ప్రజారాజ్యంపై వైఎస్ఆర్ చేసిన కోవర్టు ఆపరేషన్లకు ధీటుగా ఇప్పుడు జగన్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ జనసేనపై కోవర్టు ఆపరేషన్లు నిర్వహిస్తోంది. తాజాగా జనసేన కేంద్రకార్యాలయ ఇంచార్జ్ గా పని చేస్తున్న వ్యక్తిని వైసీపీలో చేర్చుకున్నారు. నేరుగా సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో పార్టీలో చేరిపోయారు. ఆయన పేరు సందీప్ రాయల్. కొంత కాలంగా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి చాలా కీలక విషయాలు వైసీపీకి లీక్ అవుతున్నాయి. ఇదెలా జరుగుతుందా అని ఆరా తీస్తే.. చివరికి ఈ ఇంచార్జ్ సందీప్ రాయల్ గురించి బయటపడిందని జనసేన వర్గాలు చెబుతున్నాయి.
చివరికి ఆయన వైసీపీలో చేరిపోయారంటున్నారు. జనసేనలో ఇంకా కొంత మంది సజ్జల రామకృష్ణారెడ్డి పే రోల్స్ లో ఉన్నారని.. వారి పని ఎప్పటికప్పుడు సమాచారం లీక్ చేయడమేనని అంటున్నారు. కోవర్ట్ ఆపరేషన్లు చేయడంలో .. కుట్ర రాజకీయాలు చేయడంలో కీలకంగా ఉండే సజ్జల.. కింది స్థాయి నుంచి జనసేన పార్టీలో కోవర్టులను పెట్టుకున్నారు. టీడీపీతో పొత్తుులు ఖరారు కావడంతో.. కొంత మంది నేతల్ని కూడా జనేసనలోకి పంపించే ప్రయత్నంలో ఉన్నారని చెబుతున్నారు.
ముఖ్యంగా ఉత్తరాంధ్రా, ఉభయగోదావరి జిల్లాల నుంచి సజ్జల రామకృష్ణారెడ్డికి సన్నిహితులైన కొంత మంది త్వరలో జనసేనలో చేరి.. టిక్కెట్ల పేరుతో నామినేషన్ల పేరుతో రచ్చ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని కూడా చెబుతున్నారు. ఈ అంశంపై పవన్ కల్యాణ్.. జాగ్రత్తగా ఉండాలని.. కోవర్ట్ ఆపరేషన్లపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాల్సి ఉందని జనసైనికులు భావిస్తన్నారు.