ఏపీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితికి అద్దం పట్టే ఘటన ఇది. ప్రైవేట ఆస్తులను వైసీపీ నిజమైన నేతలు ఎలా కైవసం చేసుకుంటున్నారో కళ్ల ముందు కనిపించే ఘటన ఇది. కడప జిల్లా బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ సుధ స్థలాన్ని వైసీపీ నేతలు కబ్జా చేశారు. దీనిపై అధికారులు కూడా ఏమీ చేయలేకపోతున్నారు. కడప జిల్లా బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ సుధకు కడప నగర శివారులో దాదాపు 27 సెంట్ల భూమి ఉంది. ఈ భూమిపై కన్నేసిన వైసీపీ నేతలు, స్థలాన్ని కబ్జా చేసి నిర్మాణాలు ప్రారంభించారు.
27 సెంట్ల భూమిని వైసీపీనేతలు అక్రమించగా.. ఇప్పుడు కేవలం రెండు సెంట్లు మాత్రమే ఉంచారు. ఇలా కబ్జా చేయడంపై ఎమ్మెల్యే సుధ ఆర్డీవో ధర్మ చంద్రారెడ్డిని కలిశారు తమ భూమిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆర్డీవోని కోరారు. అయితే ఆర్డీవో కూడా ఈ విషయంలో నిస్సహాయత వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే సుధ స్థలం ఇంకా ఆమె చేతుల్లోకి రాలేదని తెలుస్తోంది.
బద్వేలు ఎమ్మెల్యేగా ఉన్న వెంకటసుబ్బయ్య కరోనా కారణంగా చనిపోవడంతో ఆయన భార్య అయిన డాక్టర్ సుధకు టిక్కెట్ ఇచ్చారు. ఆమెగెలిచారు. అయితే.. ఆమెను ఇప్పుడు పార్టీ పరంగా పట్టించుకోవడం లేదు. ఎలాంటి కార్యక్రమాలకూ పిలవడం లేదు. వచ్చే ఎన్నికల్లో ఆమెకు టిక్కెట్ ఇచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. దీంతో ఏ మాత్రం పవర్ లేని ఆమె స్థలాన్ని కబ్జా చేసినా ఎవరూ పట్టించుకోరనుకున్నారేమో కానీ ఆక్రమించేసుకున్నారు. ఈ వ్యవహారంలో వీలైనంత వరకూబయటకు రాకుండా సెటిల్ చేస్తామని… మీడియాతో మాట్లాడవద్దని.. ఎమ్మెల్యేపై ఒత్తడి తెస్తున్నట్లుగాచెబుతున్నారు.