తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు స్వతంత్ర దర్యాప్తు బృందంతో సిట్ ను ఏర్పాటు చేయాలన్న ఆదేశాలను ఏపీ ప్రభుత్వ పెద్దలంతా స్వాగతించగా.. వైసీపీలో మాత్రం భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.
వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టులో తమ వాదన నెగ్గిందని చెప్పుకొగా… జగన్ కూడా అదే వాయిస్ వినిపించినా దాన్ని చివరి వరకు కొనసాగించడంలో తడబడ్డారు. వాస్తవాలు అన్ని కళ్ళ ముందు ఉండగా సిట్ ఎందుకు? బిట్ ఎందుకన్నారు. అంటే స్వతంత్ర దర్యాప్తు బృందంతో విచారణ ఎందుకు అని పరోక్షంగా ప్రశ్నించేశారు.
లడ్డూ వివాదంపై సీబీఐ దర్యాప్తును కోరిన వైసీపీ… ఆ దిశగా సుప్రీంకోర్టు ఆదేశాలు లేకపోయేసరికి బాబాయ్, అబ్బాయ్ ఇద్దరూ తడబడినట్లు వైవీ సుబ్బారెడ్డి, జగన్ ల విభిన్నమైన రియాక్షన్ లను చూస్తే అర్థం అవుతోంది. వైవీ సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తే.. జగన్ మాత్రం కొత్త సిట్ కూడా అవసరం లేదన్నారు. అసలు లడ్డూ కల్తీ జరగలేదని అలాంటప్పుడు సిట్ ఎందుకన్నారు.
తిరుమల లడ్డూ కల్తీ అయింది.. లేనిది తేల్చేది దర్యాప్తు సంస్థలు. కానీ జగన్ మాత్రం తనకు తానుగా కల్తీ జరగలేదని సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు. ఆయనే విషయాన్ని రూడీ చేస్తే వ్యవస్థలు ఎందుకు..? ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా పని చేసిన జగన్ కు ఈ విషయం తెలియదా? లేక స్వతంత్ర దర్యాప్తు బృందం కూడా లడ్డూ కల్తీ అయిందని తెల్చితే ఇబ్బందులు వస్తాయనే.. సిట్ అవసరం లేదన్నారా? అనేది చర్చనీయాంశం అవుతోంది.