ఏపీలో మరో మూడు రోజుల్లో ప్రచారం ముగియనున్న నేపథ్యంలో వైసీపీ ఏమైనా ప్లాన్ చేస్తుందా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వైసీపీ అనుకూలురుగా ముద్రపడిన అధికారులను ఈసీ మార్చేస్తుండటంతో జగన్ రెడ్డి దిక్కితోచని స్థితిలో పడిపోయారు. బస్సు యాత్ర అనుకున్న అనుకున్న రీతిలో సక్సెస్ కాకపోవడంతో అధికారుల సహకారంతో నెగ్గుకురావొచ్చునని అంచనా వేసినా ఈసీ షాక్ ఇస్తోంది. దీంతో ఏపీలో వైసీపీ ఎన్నికల రాజకీయం ఫ్యాక్షన్ పాలిటిక్స్ ను పరిచయం చేయనుందా..? అనే సందేహాలు వస్తున్నాయి.
ఏపీలో ఎన్నికలు బాగా జరుగుతాయన్న నమ్మకం కలగడం లేదంటున్న జగన్ వ్యాఖ్యలే ప్రజల్లో ఈ అనుమానాలకు కారణం అవుతున్నాయి. అధికారులను మార్చేసినంత మాత్రాన ఎన్నికలు సజావుగా జరగవని భావించడం చూస్తుంటే జగన్ అధికారులపై ఎంతలా ఆధారపడ్డారో స్పష్టం అవుతోంది. ఇప్పుడు వైసీపీ అనుకూల ఆఫీసర్లు లేకపోవడంతో వైసీపీ ఏం చేయనుందనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో విస్తృతంగా జరుగుతోంది. అధికారం కోసం ఎలాంటి రాక్షస క్రీడలకైనా వైసీపీ పాల్పడుతుందని విమర్శలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి.
పోలింగ్ తేదీ సమీపించే కొద్ది వైసీపీ తోక జాడిస్తుందని…తన ఫ్యాక్షన్ పాలిటిక్స్ ను రుచి చూపిస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. అధికారులు లేకపోతేనేం తమకు తెలిసిన విద్యతో ఎన్నికలను ఎదుర్కొంటామనే తరహలో వైసీపీ అక్రమాలకు, అరాచకాలకు పాల్పడే అవకాశం ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.