వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా అస్సాం అనుకుంటున్నారు కానీ ఆ పార్టీ బీహార్ చేరిపోయింది. ఎందుకంటే బీహార్లో జరిగిన దాన్ని ఆంధ్రాకు అన్వయించి ప్రచారం చేసుకుంటున్నారు. అక్కడ జరిగినవి ఇక్కడ జరిగినట్లుగా ఊహించుకుని ప్రచారం చేసుకుంటున్నారు. చివరికి ఫేక్ న్యూస్ అని పోలీసులతో కూడా వార్నింగులు ఇప్పించుకుంటున్నారు.
బీహార్ ప్రభుత్వం ఇటీవల ఇఫ్తార్ విందును ఇస్తున్నట్లుగా ప్రకటించింది. అక్కడి ఓ ముస్లిం సంఘం మీ ఇఫ్తార్ విందుకు మేం రాం అని చెప్పిందని.. ఓ వార్త వచ్చింది అంతే..మన పార్టీ బీహార్ చేరిపోయిందని అనుకున్నారేమో కానీ ఆ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు వెంటనే చంద్రబాబు ఇఫ్తార్ విందుకు ముస్లిం సంఘాలు రానంటున్నాయి.. బాయ్ కాట్ చేశాయని ప్రచారం చేయడం ప్రారంభించారు. వైసీపీ అధికారిక సోషల్ మీడియా కూడా అదే చెప్పడం ప్రారంభించింది. ఇంతకీ ఏ సంస్థ రానందో మాత్రం చెప్పలేదు.
వైసీపీ చేసిన ఘోరమైన పరిపాలనకు.. ఎంతో మంది ముస్లింలు బలయ్యారు. వారు కూడా వైసీపీకి ఓటేయలేదని రాయలసీమలో చాలా స్థానాల్లో వచ్చిన ఫలితమే నిరూపించింది. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబుపై ఇలాంటి తప్పుడు ప్రచారాల ద్వారా మళ్లీ వారి ని తమ దగ్గరకు చేసుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. కానీ తెలివి తక్కువ తనం వల్ల ఇట్టే దొరికిపోతున్నారు.