ఎన్టీఆర్‌ను రాజకీయాలకు అంటగట్టకుండా చాలా మంది ఫ్యాన్స్ ప్రయత్నిస్తున్నారు కానీ ఆయనను అలా ప్రశాంతంగా ఉండనివ్వకుండా ఆత్మీయులే రాజకీయాలు చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ బీజేపీలోచేరిపోయినట్లేనని వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని చెప్పుకొస్తున్నారు. ఎన్టీఆర్‌కు ఆప్తుడు కొడాలి నాని. ఇప్పుడు ఆ ఆప్తత్వం ఉందో లేదో స్పష్టత లేదు కానీ.. జూనియర్ ఎన్టీఆర్ బీజేపీలో చేరుతున్నారన్నట్లుగా మాట్లాడుతూ తెర ముందుకు వచ్చారు.
అమిత్ షా, మోడీ ఇద్దరు బీజేపిని ఎలా విస్తరించాలి, రాష్ట్రల్లో బీజేపిని ఎలా అధికారంలోకి తేవాలన్నదే వారి లక్ష్యం.. నిత్యం అలాంటి పని లోనే ఉంటారు ..మిగిలిన అంశాలు వారు పట్టించుకోరు.. కాబట్టి ఎన్టీఆర్ ను కూడ రాజకీయ కోణంలోనే కలిశారని అనుకుంటున్నానని ఆయన చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ ఇప్పుడు కొత్తగా హీరో కాదని, పాతిక సినిమాలు కూడ చేశారని, తెలుగు సినిమాలు హిందీలో కూడ డబ్ అవుతాయని వాటిని అమిత్ షా చూసే ఉంటారని కొడాలి అన్నారు. ఆయనతో దేశవ్యాప్తంగా ప్రచారం చేయించుకుంటారని కూడా జోస్యం చెప్పారు. చంద్రబాబు, పవన్‌తో ఉపయోగం లేదని.. జూనియర్‌ను అమిత్ షా కలిశారని జోస్యం చెప్పారు.
పవన్ కూడ డిల్లీ పెద్దలను కలవటం లేదని, కొడాలి వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబుకు అమిత్ షా ఎందుకు అపాయింట్ మెంట్ ఇవ్వలేదని అంటున్నారు. అయితే… కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి పరోక్షంగా స్పందించారు. సినిమాలు.. సీనియర్ ఎన్టీఆర్ గురించి తప్ప.. రాజకీయాలపై ఇరువురి మధ్య చర్చ జరగలేదన్నారు. బీజేపీ వాళ్లు ఎన్టీఆర్‌ను రాజకీయంగా ఇబ్బంది పెట్టకుండా చూస్తూంటే.. వైసీపీ వాళ్లు మాత్రం ఆయనను రాజకీయాల్లోకి లాగడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.