తెలుగుదేశంపార్టీ హయాంలో చంద్రన్న బీమా అనే పథకం ఉండేది. సహజ మరణం కూడా రూ. 30వేలు, ప్రమాద మరణానికి రూ. 2 లక్షలు ఇచ్చేవారు. వారికి వీరికి అని కాకుండా… రాష్ట్రంలో 90 శాతం మంది ప్రజలకు.. పది అంటే పది రూపాయల ప్రీమియంతో ఈ బీమా సౌకర్యం కల్పించారు. ఎల్ఐసీతో ఒప్పందం చేసుకుని ప్రభుత్వం ఈ బీమా అమలు చేసింది.
పేదల ఇళ్లలో పెళ్లితో పాటు చావు కూడా ఖర్చుతో కూడుకున్నదే. హఠాత్తుగా జరిగే మరణాలకు మట్టి ఖర్చులకు కూడా ఇబ్బంది అవుతుంది. అందుకే చనిపోయారని సమాచారం ఇచ్చిన వెంటనే ఇంటికే డబ్బులు తెచ్చి ఇచ్చే వ్యవస్థను చంద్రబాబు ఏర్పాటు చేశారు. కొన్ని లక్షల మందికి ఈ బీమా ఉపయోగపడింది. 2018లలో ఈ బీమా పరిమితిని సహజ మరణంకు లక్ష.. ప్రమాద మరణంకు రూ. ఐదు లక్షలకు చంద్రబాబు ప్రభుత్వం పెంచింది.
ప్రజల్ని ఆశ పెట్టి మోసం చేసిన జగన్ రెడ్డి ఈ పథకానికి ప్రజల్లో ఆదరణ ఉందని తెలిసి.. అడ్డగోలు హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలో జీవన బీమా పేరుతో ఓ ప థకం ప్రకటించారు. 18 నుంచి 60 సంవత్సరాల ఏ పౌరుడైనా సహజంగా మరణిస్తే వైఎస్ఆర్ జీవన బీమా పథకం ద్వారా రూ. లక్ష అందిస్తామని ప్రకటించారు. ఐదేళ్లలో అసలు ఈ పథకం ఒకటి ఉందని కూడా ఎవరికీ తెలియదు. పేద ప్రజలు చనిపోతే ప్రభుత్వం ఒక్క రూపాయి సాయం చేయలేదు. అంత ఎందుకు… పించన్ల రాజకీయంలో 32 మంది వృద్ధులు చనిపోతే.. వారి శవాల్ని తీసుకెళ్లి రాజకీయం చేయాలనుకున్నారు కానీ.. ఇదిగో వైఎస్ఆర్ బీమా ఉంది.. దీనిద్వారా లక్ష రూపాయలు వస్తాయని చెప్పి సాయంచేయలేదు. ఎందుకంటే అసలు అలాంటి పథకమే లేదు.
పథకాల పేరుతో ప్రజల్ని ఆశ పెట్టి అత్యంత ఘోరంగా మోసం చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. పాదయాత్రలో ఇచ్చిన హామీలను మేనిఫెస్టోలో పెట్టలేదు. మేనిపెస్టోలో పెట్టిన హమీలను అమలు చేయలేదు. గత ప్రభుత్వం అమలు చేసిన చంద్రన్న బీమా వంటి పథకాలను వైఎస్ఆర్ బీమా పేరుతో మార్చి… ఎందుకూ పనికి రాకుండాచేశారు. ఏ ఒక్కరికీ సాయం అందకుండా చేశారు. ఇలాంటి ప్రభుత్వానికి కర్రు కాల్చి వాత పెట్టకపోతే పేదల శవాలతో రాజకీయం చేసుకునే రాబందుల్లా మారిపోతారు.