ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ జరుగుతోందంటే.. ఏ నిర్ణయం తీసుకుంటారో..అని ప్రజలు గతంలో ఆసక్తిగా చూసేవాళ్లు.కానీ వైసీపీ సర్కార్ ఏర్పడ్డాక ఏ నిర్ణయం తీసుకున్నా అమలు చేస్తారనే నమ్మకం లేకపోవడంతో ప్రజలు కూడా పూర్తిగా ఆసక్తి కోల్పోయారు. మీడియా కూడా అంతే పట్టించుకోవడం మానేసింది. వివాదాస్పద సంస్థలకు భూముల కేటాయింపు నిర్ణయాలు రహస్యంగా ఉంచుతారు. అసలు ఎప్పట్నుంచో ఉన్న పథకాల అమలుకు .. ఆమోదం అంటూ తీసుకున్న నిర్ణయాలనే బయటకు చెబుతారు.
తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలోనూ అదే జరిగింది. అసైన్డ్ భూములపై హక్కులంటూ..కొత్తగా ప్రచారం చేశారు. గతంలో ఇళ్ల రుణాలు చెల్లిస్తే రూపాయికే రిజిస్ట్రేషన్ చేసి లక్షల్లో ఆస్తి చేతుల్లో పెడతామని చెప్పారు..అదేమయిందో అందరూ చూశారు. ఇప్పుడు కూడా ఇలాంటిదేదో చేస్తున్నారని ప్రజలు లైట్ తీసుకుంటున్నారు. కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలను..అమలు చేసింది చాలా తక్కువ. ఒక్క బటన్ నొక్కుడు పథకాలకు ఆమోదం అంటే చేసే హడావుడే ఎక్కువ.
కేబినెట్ తర్వాత మంత్రులతో జరిగే సమావేశంలోనూ జగన్ లో అంత ఉత్సాహం కనిపించడం లేదు. తన పాలనను తాను పొగుడుకోవడానికే సమయం వెచ్చిస్తున్నారు. సురక్షా కార్యక్రమం భలేగా జరిగిందని జగనే చెప్పుకుని మంత్రుల్ని సైతం.. విస్మయానికి గురి చేశారు. మందస్తు గురించి ఆలోచించవద్దని..ఎన్నికలకు సిద్ధమవ్వాలని.. చెప్పి.. వారికీ క్లారిటీ ఇవ్వలేకపోయారు. మరీ ఇంత నీరసమైన కేబినెట్ మీటింగ్ లు ఎప్పుడూ చూడలేదని.. సీనియర్ నేతలు గొణుక్కోవడం కామన్ అవుతోంది.