అప్పుల బండారాలు తవ్వేకొద్దీ బయటపడుతున్న ఏపీ సర్కార్…. తాము చేస్తున్న తప్పులు చిన్నవేనని.. తెలంగాణ సర్కార్ అంతకు మించి చేసిందనే విషయాలను బయట పెడుతోంది . ఈ అంశం ఇప్పుడు సంచలనంగా మారింది. రాయలసీమ ప్రాజెక్టులకు పైసా ఖర్చు చేయకుండా…. పనులు చేసినట్లుగా చూపించి రూ. 900 కోట్లను . .. నేరుగా రుణం తీసుకున్న ఆర్ఎఫ్సీ, పీఎఫ్సీ సంస్థల నుంచి కాంట్రాక్ట్ సంస్థ అయిన మేఘాకు మళ్లించారని పీఏసీ చైర్మన్ పయ్యావుల ఆరోపించారు. దీనిపై పత్రాలు బయట పెట్టారు. ఇది రాష్ట్రంలో సంచలనం అయింది.
దీనిపై ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. పనులు జరిగాయని చెప్పలేదు. కానీ పనులు జరిగినట్లుగా ఎన్జీటీ నిర్ధారించిందంటూ కొత్త కథలు చెప్పింది. రాయలసీమ కరువు నివారణ పేరుతో ఎలాంటి నిబంధనలు పాటించకుండా.. అనుమతులు తీసుకోకుండా ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టడంపై ఎన్జీటీ నిషేధం విధించింది. దీంతో ఆ ప్రాజెక్టు పనులు ఆగిపోయాయి. అప్పటికీ కొన్ని పనులుజరిగాయని ఎన్టీటీ రిపోర్టు ఇచ్చింది. ఆ రిపోర్టును అడ్డం పెట్టుకుని మేఘా కు నిధులు.. మళ్లించారు. ఎలక్ట్రో మెకానికల్ పనులు జరిగినట్లుగా ఆ నిధులు తీసుకున్నారు. కానీ అక్కడ అలాంటి పనులే జరగలేదని పయ్యావుల కేశవ్ ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం వివరణ ఇవ్వలేదు.
అసలు ఏ అప్పు అయినా రణ సంస్థ నుంచి నేరుగా ఎలా కాంట్రాక్టర్ కు బదిలీ చేస్తారనేది సంచలనంగా మారింది. కన్సాలిడేటెడ్ ఫండ్ కు వస్తేనే… లెక్కల్లో కనిపిస్తుంది. లేకపోతే కనిపించదు. అయితే ఇలా రాకుండానే కాంట్రాక్టర్ కు ఇచ్చేయవచ్చని.. కాళేశ్వరం విషయంలో తెలంగాణ రూ. 40వేల కోట్లు ఇలా కాంట్రాక్ట్ సంస్థకు మళ్లించిందని సమర్థించుకుంది. ఏపీ సంగతి చెప్పమంటే.. సాక్ష్యంగా తెలంగాణ సర్కార్ ను చూపించడంతో .. ఇప్పుడు వివాదం ప్రారంభమయింది. తెలంగాణ మేఘా ఖాతాలోకి… రూ. నలభై వేల కోట్లు మళ్లించిందా అన్న చర్చ ప్రారంభమయింది.