ఏపీలో ఇప్పుడు ఒక్కటే చర్చ. ఆ చర్చలో బరితెగింపు అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. ఇలాంటి బరితెగింపును మరోసారి అధికార పార్టీ నేతలు రుజువు చేసేలా ఉన్నారు. ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించినట్లుగా ఢిల్లీ నుంచి వస్తున్న ఆయనకు భారీ స్వాగతం చెప్పేందుకు సిద్ధమవుతున్నారన్నదే ఆ బరి తెగింపు. మాధవ్ ఎం చేశారు ? ఓ మహిళతో నగ్న వీడియోలో కనిపించారు. ఆ వీడియో ఇప్పుడు పోర్న్ సైట్లలో పాపులర్ అయిపోయింది. కొన్ని వందల పోర్న్ సైట్లలో ఇప్పుడది హాట్ టాపిక్ అయింది. ఆ పాపులారిటీకే మెచ్చి ఆయనకు ఘనస్వాగతం చెప్పడానికి వైసీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారేమో ?
మాధవ్ చేసిన పనికి కులాన్ని అడ్డు పెట్టుకుంటున్నారు. వేరే కులాన్ని బండ బూతులు తిట్టి తమ కులం మద్దతు ఇవ్వాలని ఆయన పరోక్ష బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతున్నారు. అయితే కులం ఉన్నతంగా ఉండాలంటే… ఆలోచనలు ఉన్నతంగా ఉండాలి. అలాంటి వారినే ఆదర్శంగా తీసుకోవాలి. కానీ మాధవ్ వంటి వారికి మద్దతిస్తే ఆ కులం ఉన్నతంగా నిలబడుతుందా ? కానీ రాజకీయంగా కులాన్ని వాడుకునే విషయంలో ఏ మాత్రం సిగ్గూ లేకుండా ప్రవర్తించే వైసీపీ నేతలు వాటిని పట్టించుకోవడం లేదు.
మాధవ్‌కు నిజంగానే పూర్తి స్థాయిలో మద్దతు లభిస్తే … సమాజంలో ఇక ఆయన చేసిన పని తప్పు అనుకునేవారు ఉండరు. మహిళలను అదే విధంగా వేధించేవారు పెరిగిపోతారు. అంతిమంగా అది సమజానికే నష్టం చేస్తుంది. అంటే ప్రజలకే. అయితే ఆయనకు మద్దతుగా ఉంటున్న వారు కూడా రేపు ఇలాంటి బాధలు ఎదుర్కోవచ్చు. వారికి కూడా న్యాయం అందదు. వేధింపులకు సిద్ధపడాల్సి రావొచ్చు.