ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతోన్న కొద్దీ అధికార వైసీపీకి ఎదురుగాలి వీస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను టీడీపీ బలంగా ఎండగడుతుండటం…వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉండటంతో ఓటర్లు కూటమి వైపు మొగ్గుచూపుతున్నట్లు కనిపిస్తోంది. రాయలసీమలో సత్తా చాటుతుందని అంచనా వేసినా అక్కడ కూడా వైసీపీ ఎదురీదుతున్నట్లు కనిపిస్తోంది.
ఇప్పటికే పలు సర్వేలు ఏపీలో కూటమిదే అధికారమని తేల్చాయి. తాజాగా స్ట్రా పోల్ సంస్థ కర్నూల్ జిల్లాకు సంబంధించి సర్వే నిర్వహించింది. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తుందని వెల్లడించింది. దీంతో రాయలసీమలోనూ జగన్ రెడ్డికి ఝలక్ తప్పదని తేలింది. మేమంతా సిద్ధంతో జనం జనంలోకి వెళ్తున్నా వైసీపీ పీఆర్ స్టంట్లు మినహా పెద్దగా ఆదరణ లభించడం లేదు.
వీటన్నింటిని అంచనా వేసే నేతలు టీడీపీలోకి క్యూ కడుతున్నట్టు కనిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా వైసీపీని వీడుతున్నారంటే.. ఆ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదని గుర్తుంచే వలసలు షురూ చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాయలసీమలో మెజార్టీ సీట్లు దక్కించుకోవాలని చూసిన వైఎస్ వివేకా హత్య కేసు విషయంలో జగన్ రెడ్డి అనుసరిస్తోన్న విధానం నచ్చకే ప్రజలు కూటమిని బలపరుస్తున్నారన్న చర్చ జరుగుతోంది.