కొంత మంది మనస్థత్వాలు విచిత్రంగా ఉంటాయి. తాము నిండా మునిగిపోయి ఉన్నా పర్వాలేదు… వేరే వాళ్లకు ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే ఆనందిపడిపోతూంటారు. ఒక్కోసారి ఎలాంటి ఇబ్బంది రాకపోయినా అలా చెప్పుకునే ఆనందపడిపోతూంటారు. అలాంటి మనస్థత్వాలు అన్ని చోట్లా కనిపిస్తూ ఉంటాయి. తాజాగా మోదీ మన్ కీ బాత్లో సినీ దిగ్గజాల గురించి చెబుతూ తెలుగు నుంచి అక్కినేని నాగేశ్వరరావు గురించి మోదీ ప్రస్తావించారు. అలాగే రాజ్ కపూర్, మహమ్మద్ రఫీ, తపన్ సిన్హా వంటి వాళ్లను ప్రస్తావించారు. అంటే ఎన్టీఆర్ ను ప్రస్తావించలేదంటూ చంకలు గుద్దేసుకుంటూ ఆనందపడుతున్నారు.
మోదీ కేవలం సినీ రంగానికి మాత్రమే జీవితాన్ని అంకితం చేసిన వారి గురించి చెప్పారు. ఎన్టీఆర్ సినీరంగంతో పాటు రాజకీయ రంగంలోనూ అంతే ఎత్తుకు ఎదిగారు. మోదీ ప్రస్తావించిన ఎవరికీ రాజకీయ నేపధ్యం లేదు. అలాగని మోదీ ప్రస్తావించనంత మాత్రాన వారు మాత్రమే దిగ్గజాలు అని అర్థం కాదు. అయినా ఎన్టీఆర్ పేరు ప్రస్తావించకపోతే ఎందుకు వారికి అంత ఆనందం అంటే.. అదో తుత్తి అనుకోవాలి. బీజీపీ, టీడీపీ మధ్య తేడా వచ్చిందని అనుకుని సంతృప్తి పడాలి. ముందుగా చెప్పుకున్నట్లుగా .. దేంట్లో అయినా ప్రత్యర్థులకు కష్టం వచ్చిందని సంతోషపడటం అన్నమాట.
రేపో మాపో మోదీ అలా ప్రకటించిన వారెవరికీ కాకుండా కేంద్రం ఎన్టీఆర్ కు భారత రత్న ప్రకటిస్తే వీరే మళ్లీ గుడ్డలు చించేసుకుంటారు. కేంద్రంలో టీడీపీ కీలక పొజిషన్లో ఉంది కాబట్టి ఇప్పించుకున్నారు.. అని అంటారు. అప్పుడు ఈ ఆనందం అంతా ఉండదు.