వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనే భావన పెంచడానికి షర్మిల చేస్తున్న ప్రయత్నాలకు జగన్, వైసీపీ నేతల వద్ద కౌంటర్ లేకుండా పోయింది. అసలు పట్టించుకోవడం లేదు. ఇప్పటికే వైఎస్ ప్రస్తావన వైసీపీలో లేదు. 75వ జయంతిని పూర్తిగా షర్మిల హైజాక్ చేస్తున్నారు. విజయవాడలో భారీ కార్యక్రమం నిర్వహిస్తున్ననాారు. వైఎస్ ఆత్మీయ నేతలందర్నీ పిలుస్తున్నారు. దీనికి కౌంటర్ గా ఏం చేయాలన్నది మాత్రం వైసీపీ ఇంకా నిర్ణయించుకోలేదు.
వైసీపీ నేతలు ఓటమి భారం నుంచి బయటపడలేదు. ఇప్పుడల్లా ఖర్చులు పెట్టుకునేందుకు కూడా పార్టీ నేతలు ముందుకు వచ్చే అవకాశం లేదు. మామూలుగాఅయితే వైఎస్ జయంతికి ప్లీనరీలు అయినా నిర్వహించేవారు. ఈ సారి అలాంటి ఆలోచన కూడా చేయలేదు. వైఎస్ఆర్ అవార్డులు లాంటివి ప్రభుత్వం ఇవ్వదు. పార్టీ పరంగా ఇద్దామన్న ఆలోచన చేయరు. అయితే ప్రజాధనంతో ఇస్తారు కానీ.. పార్టీ ధనంతో ఇచ్చే అవకాశాలు లేవు. అసలు వైఎస్ సంస్మరణకు ఏం చేయాలన్న ఆలోచన పెట్టుకోలేదు.
జయంతి కార్యక్రమం నిర్వహణ ద్వారా షర్మిల తానే వైఎస్ అసలైన వారసురాలినని ప్రజల్లోకి సంకేతాలు పంపనున్నారు. కొంత మంది వైసీపీ నేతల్ని కూడా చేర్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే బీజేపీ వెంట జగన్ పడుతున్నందున ముస్లిం, క్రిస్టియన్ వర్గాలు ఆయనకు దూరంగా జరుగతున్నాయి. గత ఎన్నికల ఫలితాల్లో అది కనిపించింది. రాయలసీమలో ముస్లింలు కాంగ్రెస్ కు ఓటేశారు. ఈ ట్రెండ్ ను కొనసాగించే.. వచ్చే రెండు, మూడేళ్లలో తేడా చూపించాలని షర్మిల గట్టి ప ట్టుదలగా ఉన్నారు. వైసీపీకి కౌంటర్ ఇవ్వడానికి సరైన ప్లాన్ కూడా లేనట్లుగా ఉంది.